Telugu Global
NEWS

వాళ్లు మాకంటే పోటుగాళ్లా? అంటున్న కడప టీడీపీ నేతలు

జనంలో ఆదరణ లేకపోయినా కడప జిల్లా టీడీపీ లో ఆధిపత్యపోరుకు మాత్రం కొదవ లేదు. ఖాళీగా ఎవరున్నా పార్టీలోకి చంద్రబాబు ఆహ్వానిస్తుండడంతో దీనిపైనే పాత నేతలు అభ్యంతరం చెబుతున్నారు. డీఎల్ రవీంద్రారెడ్డి, వరదరాజుల రెడ్డి, వీరశివారెడ్డి.. ముగ్గురూ ప్రత్యక్ష ఎన్నికలతో దాదాపు సంబంధాలు కోల్పోయారు. వారి స్థానాల్లో కొత్త నేతలు నియోజకవర్గాల్లో పాగా వేశారు. వీరి పరిస్థితి ఇప్పుడు ప్రత్యక్షంగా ఎన్నికలను ఫేస్ చేసేందుకు కాకుండా.. పోటీ చేస్తున్న వారికి ఆశీర్వాదాలు ఇవ్వడానికి పరిమితమైందన్న అభిప్రాయం. రెండు […]

kadapa
X

జనంలో ఆదరణ లేకపోయినా కడప జిల్లా టీడీపీ లో ఆధిపత్యపోరుకు మాత్రం కొదవ లేదు. ఖాళీగా ఎవరున్నా పార్టీలోకి చంద్రబాబు ఆహ్వానిస్తుండడంతో దీనిపైనే పాత నేతలు అభ్యంతరం చెబుతున్నారు. డీఎల్ రవీంద్రారెడ్డి, వరదరాజుల రెడ్డి, వీరశివారెడ్డి.. ముగ్గురూ ప్రత్యక్ష ఎన్నికలతో దాదాపు సంబంధాలు కోల్పోయారు. వారి స్థానాల్లో కొత్త నేతలు నియోజకవర్గాల్లో పాగా వేశారు. వీరి పరిస్థితి ఇప్పుడు ప్రత్యక్షంగా ఎన్నికలను ఫేస్ చేసేందుకు కాకుండా.. పోటీ చేస్తున్న వారికి ఆశీర్వాదాలు ఇవ్వడానికి పరిమితమైందన్న అభిప్రాయం.

రెండు రోజుల క్రితమే వీరశివారెడ్డి నారా లోకేష్‌ను కలిశారు. డీఎల్ రవీంద్రారెడ్డి జగన్‌ ప్రభుత్వాన్ని వరుస పెట్టి తిడుతున్నారు. డీఎల్‌కు యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్‌ యాదవ్ రూపంలో మైదుకూరులో బలమైన అడ్డంకి ఉంది. ఈ పరిణామాలపై టీడీపీ కడప జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు.

వీరశివారెడ్డి.. నారా లోకేష్‌ను కలవడాన్ని ప్రస్తావించిన కమలాపురం టీడీపీ ఇన్‌చార్జ్ పుత్తా నరసింహారెడ్డి.. నిన్నటి దాక వైసీపీలో ఉండి, 2019లో వైసీపీ కోసం పనిచేసిన వారు ఇప్పుడు ఎందుకు లోకేష్‌ను కలిశారని ప్రశ్నించారు. కొత్త పరిణామాల వెనుక పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్‌ రవిల హస్తముందని భావిస్తున్న పుత్తా నరసింహారెడ్డి.. వారిద్దరూ తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారని సమావేశంలో ఆరోపించారు. ఇందుకు శ్రీనివాస్‌ రెడ్డి, బీటెక్ రవి తీవ్రంగా స్పందించారు. తామెక్కడ జోక్యం చేసుకున్నామో చెప్పాలంటూ నిలదీశారు.

దాంతో మరింత ఆగ్రహించిన నరసింహారెడ్డి.. తమకు చెప్పకుండా తన అన్న కుమారుడిని లోకేష్‌ వద్దకు ఎందుకు తీసుకెళ్లావని బీటెక్ రవిని ప్రశ్నించారు. తాను తీసుకెళ్లలేదని.. తాను వెళ్లే సరికి ఆఫీస్‌ వద్ద అతడు ఉండడంతో లోకేష్‌ వద్దకు తీసుకెళ్లానని బీటెక్ రవి వివరణ ఇచ్చారు. వివాదం పెద్దది అవుతుండడంతో ఇతర నేతలు జోక్యం చేసుకుని సముదాయించారు.

ఇంతలో మైదుకూరు టీడీపీ ఇన్‌చార్జ్ పుత్తా సుధాకర్ యాదవ్‌ .. డీఎల్ అంశాన్ని ప్రస్తావించారు. తాము ఉండగా డీఎల్‌ను తీసుకురావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిని పార్టీలోకి తీసుకురావాలన్న ప్రయత్నాలను మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అసలు జిల్లా పార్టీ నేతలకు చెప్పకుండా.. డీఎల్‌, వీరశివారెడ్డి,వరదరాజుల రెడ్డిలను పార్టీలోకి ఎందుకు తీసుకొస్తున్నారని లింగారెడ్డి ప్రశ్నించారు.

ఇలా వరుస పెట్టి నేతలు ప్రశ్నించడంతో కడప, రాజంపేట పార్లమెంట్‌ టీడీపీ ఇన్‌చార్జ్ సోమిరెడ్డి అసహనం వ్యక్తంచేశారు. మీరు ప్రజల్లోకి వెళ్లి బాగా పనిచేస్తే అసలు ఇతరులు పార్టీలోకి వచ్చే అవకాశమే ఉండదు కదా అని వ్యాఖ్యానించారు. తమ నెల్లూరు జిల్లాలోనూ పలువురు నేతలు టీడీపీలోకి చేరుతున్నారని.. అక్కడ ఇలాంటి రాద్దాంతం లేదని.. ఇక్కడే గొడవ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పార్టీలోకి ఎవరూ రాకూడదు అంటే ఎలా అని ప్రశ్నించారు సోమిరెడ్డి.

అటు మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్‌ రెడ్డిని తిరిగి పార్టీలోకి రావాల్సిందిగా పులివెందుల టీడీపీ నేతలు వెళ్లి విజ్ఞప్తి చేయడంపై బీటెక్ రవి గుర్రుగా ఉన్నారు.

First Published:  10 Jun 2022 5:46 AM IST
Next Story