Telugu Global
National

ఈడీ కస్టడీలో ఉన్న మంత్రి ముఖంపై గాయాలు

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కస్టడీలో ఉన్న ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ మొహంపై రక్తపు గాయాలతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆస్పత్రి నుంచి ఆయనను కారులో తీసుకెళ్తుండగా తీసిన ఫోటోలో ఆయన మొహంపై గాయాలున్నాయి. ఆయన నోటి దగ్గర గాయం ఉంది. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ … “అతను ED కస్టడీలో ఉన్నాడు. కాబట్టి అతన్ని ప్రత్యక్షంగా మేము కలవలేదు. అందువల్ల ఏం జరిగి ఉంటుందో నేను […]

satyendra jain
X

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కస్టడీలో ఉన్న ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ మొహంపై రక్తపు గాయాలతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆస్పత్రి నుంచి ఆయనను కారులో తీసుకెళ్తుండగా తీసిన ఫోటోలో ఆయన మొహంపై గాయాలున్నాయి. ఆయన నోటి దగ్గర గాయం ఉంది. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ …

“అతను ED కస్టడీలో ఉన్నాడు. కాబట్టి అతన్ని ప్రత్యక్షంగా మేము కలవలేదు. అందువల్ల ఏం జరిగి ఉంటుందో నేను పెద్దగా చెప్పలేను. దీనిపై నేను ఎటువంటి వ్యాఖ్యానించలేని స్థితిలో ఉన్నాను.” అని అన్నారు.

గాయాలతో ఉన్న మంత్రి సత్యేందర్ జైన్ ఫోటో సోషల్ మీడియాలో విస్త్రుతంగా షేర్ చేయబడింది. వందలాది మంది నెటిజనులు బీజేపీ పై దుమ్మెత్తి పోస్తున్నారు.

“ఢిల్లీ మొహల్లా క్లినిక్‌లు ఇచ్చిన వ్యక్తి” అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా

“మొహల్లా క్లినిక్‌లను ఇచ్చిన వ్యక్తి . నిజాయితీతో ప్రజలకు సేవ చేశాడు. బీజేపీ వాళ్ళకు దేవుడు ఏదో ఒక రోజు గుణపాఠం చెబుతాడు.” అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సభ్యుడు వికాస్ యోగి అన్నారు

మరో ఆప్ నేత సంజయ్ సింగ్ ఈ ఫోటో ప్రధాని నరేంద్ర మోదీకి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు నల్ల మచ్చ అని రాశారు. దేశం మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు’ అని ట్వీట్ చేశారు.

కాగా మనీలాండరింగ్ ఆరోపణలపై సత్యేందర్ జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మే 30న అరెస్టు చేసింది. అతను జూన్ 13 (సోమవారం) వరకు ఈడీ కస్టడీలోనే ఉంటాడు.

అయితే సత్యేద్ర జైన్ ఆరోగ్యం బాగాలేదని అతని లాయర్ చెప్పారు.

COVID-19 నుండి కోలుకున్నప్పటి నుండి సత్యేందర్ జైన్ స్లీప్ అప్నియా అనే వ్యాధితో బాధపడుతున్నారు. న్యాయవాది రిషికేష్ తెలిపారు.

First Published:  10 Jun 2022 11:14 AM IST
Next Story