Telugu Global
NEWS

బండిసంజయ్ హౌజ్ అరెస్ట్

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ ని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఆర్టీసీ బస్సు చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌లోని జేబీఎస్ వద్ద ఈ రోజు ఆయన నిరసనకు పిలుపునిచ్చారు. అక్కడికి వెళ్ళకుండా బంజారాహిల్స్‌లోని ఆయన ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు సంజయ్ బయటకు రాకుండా అడ్డుకున్నారు. విషయం తెలిసిన బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సంజయ్‌ను హౌజ్ అరెస్ట్ చేయడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం […]

bandi-sanjay-house-arrest
X

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ ని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఆర్టీసీ బస్సు చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌లోని జేబీఎస్ వద్ద ఈ రోజు ఆయన నిరసనకు పిలుపునిచ్చారు. అక్కడికి వెళ్ళకుండా బంజారాహిల్స్‌లోని ఆయన ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు సంజయ్ బయటకు రాకుండా అడ్డుకున్నారు.

విషయం తెలిసిన బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సంజయ్‌ను హౌజ్ అరెస్ట్ చేయడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా జేబీఎస్ వద్ద నిరసన తెలిపి తీరుతామని తేల్చి చెబుతున్నారు.

కాగా తన హౌజ్ అరెస్టును నిరసిస్తూ బండి సంజయ్ వరుస ట్వీట్లు చేశారు.

”ప్రజాస్వామ్యయుతంగా ఆర్టీసీ ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవడానికి కూడా వెళ్లనివ్వరా..? ఆర్టీసీ చార్జీలు పెంచడం మూర్ఖత్వం కాదా..?
టీఆర్ఎస్ సర్కారు మూడేళ్లలో ఐదుసార్లు చార్జీలు పెంచింది. పేదలను బస్సుల్లో కూడా తిరగనివ్వరా..? నడుచుకుంటూ తిరగాలా..?” అని ఓ టీట్ చేయగా

”టీఆర్ఎస్ సర్కారు వచ్చినప్పటి నుంచి 60 శాతం చార్జీలను పెంచింది. పేదలు గరీబ్ రథంగా భావించే ఆర్టీసీ ఛార్జీలు పెంచడం వల్ల కేసీఆర్ పేదల ఉసురుపోసుకోక తప్పదు. మేం ఆందోళన కార్యక్రమాలు చేసేందుకు వెళ్లట్లేదు. ఇండ్లు ముట్టడించాల్సిన అవసరం పోలీసులకు ఎందుకొచ్చింది..?” అని మరో ట్వీట్ చేశారు.

First Published:  10 Jun 2022 5:23 AM IST
Next Story