Telugu Global
National

ఫకీర్లపై మూక దాడి…. జై శ్రీరాం నినాదాలివ్వాలని బెదిరింపులు

ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలోని దిగూర్ గ్రామంలో ముగ్గురు ముస్లిం ఫకీర్లపై కొందరు హి‍ందుత్వ వాదులు దాడికి పాల్పడ్డారు. ఫకీర్లతో బలవంతంగా జై శ్రీరాం నినాదాలు చేయించడమే కాక వారితో గుంజీలు తీయించారు. దిగూర్ గ్రామంలో బిక్షమెత్తుకుంటున్న ముగ్గురు ఫకీర్లను జీహాదీలు, ఉగ్రవాదులు అని ఆరోపిస్తూ ముందుగా ఓ యువకుడు వాళ్ళను అడ్డగించాడు. ఆ తర్వాత మరికొందరు ఆయనకు మద్దతుగా వచ్చారు. ఫకీర్లను ఆధార్ కార్డ్ చూపించమని బెదిరించారు. పేర్లు, అడ్రస్ లు అడిగారు. ఆ తర్వాత కర్రపట్టుకొని […]

3-muslim-fakirs-forced-to-chant-jai-shri-ram-in-up
X

ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలోని దిగూర్ గ్రామంలో ముగ్గురు ముస్లిం ఫకీర్లపై కొందరు హి‍ందుత్వ వాదులు దాడికి పాల్పడ్డారు. ఫకీర్లతో బలవంతంగా జై శ్రీరాం నినాదాలు చేయించడమే కాక వారితో గుంజీలు తీయించారు.

దిగూర్ గ్రామంలో బిక్షమెత్తుకుంటున్న ముగ్గురు ఫకీర్లను జీహాదీలు, ఉగ్రవాదులు అని ఆరోపిస్తూ ముందుగా ఓ యువకుడు వాళ్ళను అడ్డగించాడు. ఆ తర్వాత మరికొందరు ఆయనకు మద్దతుగా వచ్చారు. ఫకీర్లను ఆధార్ కార్డ్ చూపించమని బెదిరించారు. పేర్లు, అడ్రస్ లు అడిగారు. ఆ తర్వాత కర్రపట్టుకొని ఫకీర్లను భయపెట్టి గుంజీలు తీయించాడాయువకుడు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసి వాళ్ళతో కూడా చేయించాడు. అగ్రవర్ణ హిందువులున్న తమ గ్రామంలోకి రావడానికి ఎంత ధైర్యమంటు ఫకీర్లపై దాడికి ప్రయత్నించాడు యువకుడు. ఇకపై గ్రామంలో తిరగవద్దని బెదిరించాడు.ఈ ఘటనను గ్రామానికి చెందిన ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

కొంత సేపు వాళ్ళను వేధించిన అతర్వాత ఫకీర్లను గ్రామం నుండి వెళ్లగొట్టారు. మళ్ళీ తమ గ్రామంలో అడుగుపెట్టవద్దని హెచ్చరించారు. ఆ వీడియా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అది చూసిన పోలీసులు ఫకీర్లను బెధిరించిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

First Published:  10 Jun 2022 8:08 AM IST
Next Story