Telugu Global
NEWS

వైఎస్‌ వివేకా కేసు- గంగాధర్‌ రెడ్డి మృతి

వైఎస్‌ వివేకానందరెడ్డి కేసులో తెరపైకి వచ్చిన గంగాధర్ రెడ్డి చనిపోయాడు. అనంతపురం జిల్లా యాడికిలోని తన ఇంటిలోనే రాత్రి కన్నుమూశాడు… అనారోగ్యంతోనే గంగాధర్‌ రెడ్డి చనిపోయినట్టు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ముందు నుంచే ఆరోగ్యం బాగోలేదని, రాత్రి నిద్రపోయిన గంగాధర్‌ నిద్రలోనే చనిపోయాడని వారు వివరించారు. వైఎస్‌ వివేకా కేసులో గంగాధర్ పేరు వినిపించిన నేపథ్యంలో.. పోలీసులు చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టంకు తరలించారు. చనిపోయిన గంగాధర్‌ రెడ్డి… వైఎస్‌ వివేకానందరెడ్డి […]

ys-viveka-case-gangadhar-reddy-dies
X

వైఎస్‌ వివేకానందరెడ్డి కేసులో తెరపైకి వచ్చిన గంగాధర్ రెడ్డి చనిపోయాడు. అనంతపురం జిల్లా యాడికిలోని తన ఇంటిలోనే రాత్రి కన్నుమూశాడు… అనారోగ్యంతోనే గంగాధర్‌ రెడ్డి చనిపోయినట్టు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ముందు నుంచే ఆరోగ్యం బాగోలేదని, రాత్రి నిద్రపోయిన గంగాధర్‌ నిద్రలోనే చనిపోయాడని వారు వివరించారు.

వైఎస్‌ వివేకా కేసులో గంగాధర్ పేరు వినిపించిన నేపథ్యంలో.. పోలీసులు చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టంకు తరలించారు.

చనిపోయిన గంగాధర్‌ రెడ్డి… వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డికి ప్రధాన అనుచరుడు. గతంలో పోలీసుల హెచ్చరికలతో పులివెందుల వదిలేసి అనంతపురంజిల్లా యాడికి గ్రామానికి వచ్చేశాడు. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటున్నాడు.

గత ఏడాది నవంబర్‌లో ఇతడు అనంతపురం జిల్లా ఎస్పీని కలిసి వైఎస్ వివేకా కేసులో సీబీఐ తనను వేధిస్తోందంటూ ఫిర్యాదు చేశారు. కేసులో అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్‌ రెడ్డి,శివశంకర్ రెడ్డిలను ఇరించేలా తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలంటూ తనపై సీబీఐ ఒత్తిడి తెస్తోందని ఫిర్యాదులో వివరించాడు.

వైఎస్‌ వివేకానందరెడ్డిని హత్య చేస్తే పది కోట్లు ఇస్తామని శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తనకు ఆఫర్ చేసినట్టు చెప్పాల్సిందిగా సీబీఐ అధికారులు బెదిరిస్తున్నారని ఆరోపించాడు. తాను ఆ ముగ్గురి ఆఫర్‌కు అంగీకరించకపోవడంతో ఇతరుల ద్వారా వివేకానందరెడ్డిని హత్య చేయించారన్నట్టుగా వాంగ్మూలం ఇవ్వాలని అలా ఇస్తే డబ్బులు కూడా ఇస్తామంటూ ఒత్తిడి తెస్తున్నారని అనంతపురం ఎస్పీకి గతేడాది గంగాధర్ ఫిర్యాదు చేశాడు.

ALSO READ : వైఎస్సార్ యంత్ర సేవా

First Published:  9 Jun 2022 7:04 AM IST
Next Story