ఆర్ఎంపీలు ఇకపై మెడికల్ డాక్టర్లు..
ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ (పీఎంపీ), రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ (ఆర్ఎంపీ)లు కూడా వైద్యులే. పల్లెటూళ్లలో ఎంబీబీఎస్ వైద్యులు అందుబాటులో లేనప్పుడు అత్యవసర వైద్యం అందించేది వీరే. అయితే వీరు తమ పేరు ముందు డాక్టర్ అని అధికారికంగా పెట్టుకోడానికి వీళ్లేదు. ప్రాథమిక చికిత్స ద్వారా ప్రాణాపాయాన్ని తప్పించడం వీరి విధి. నేషనల్ మెడికల్ కమిషన్ లో ఎంబీబీఎస్ డాక్టర్లతోపాటు ఆర్ఎంపీ, పీఎంపీలకు కూడా స్పష్టమైన విధి విధానాలున్నాయి. అయితే తాజాగా వీటిలో సవరణలు చేస్తోంది కేంద్రం. మెడికల్ […]

ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ (పీఎంపీ), రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ (ఆర్ఎంపీ)లు కూడా వైద్యులే. పల్లెటూళ్లలో ఎంబీబీఎస్ వైద్యులు అందుబాటులో లేనప్పుడు అత్యవసర వైద్యం అందించేది వీరే. అయితే వీరు తమ పేరు ముందు డాక్టర్ అని అధికారికంగా పెట్టుకోడానికి వీళ్లేదు. ప్రాథమిక చికిత్స ద్వారా ప్రాణాపాయాన్ని తప్పించడం వీరి విధి. నేషనల్ మెడికల్ కమిషన్ లో ఎంబీబీఎస్ డాక్టర్లతోపాటు ఆర్ఎంపీ, పీఎంపీలకు కూడా స్పష్టమైన విధి విధానాలున్నాయి. అయితే తాజాగా వీటిలో సవరణలు చేస్తోంది కేంద్రం.
మెడికల్ డాక్టర్..
ఆర్ఎంపీలు ఇకపై తమ పేరుకి ముందు మెడికల్ డాక్టర్ (Med Dr) అనే పదం చేర్చుకోవచ్చు. దీనికి వెసులుబాటు ఇస్తూ నేషనల్ మెడికల్ కమిషన్.. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ (ప్రొఫెషనల్ కండక్డ్) రెగ్యులేషన్స్- 2022 పేరిట డ్రాఫ్ట్ విడుదల చేసింది. 2019 తర్వాత రిజిస్టర్ చేసుకున్న ఆర్ఎంపీలు మెడికల్ డాక్టర్ అనే హోదాకు అర్హులు. ఈ ముసాయిదాపై ఈ నెల 22లోపు సలహాలు, సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది ఎన్ఎంసీ.
ఇక రోగులకు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ పై ఆర్‌ఎంపీ రిజిస్ట్రేషన్ ఐడీ తప్పనిసరిగా వేయాల్సి ఉంటుంది. నిర్ణీత ఫీజు చెల్లించని రోగులకు వైద్యం చేయనని ఆర్ఎంపీ నిరాకరించే వెసులుబాటు కూడా ఇచ్చారు. అయితే అత్యవసర వైద్య సేవల విషయంలో ఇలా నిరాకరించడం కుదరదు. గతంలో రోగి ట్రీట్మెంట్ కార్డుని మూడు రోజుల్లోగా ఆర్ఎంపీ రెడీ చేయాలనే నిబంధన ఉండేది. ఇప్పుడది 5 రోజులకు పెంచారు. ఎమర్జెన్సీ కేసుల్లో వెంటనే ట్రీట్మెంట్ కార్డ్ సిద్ధం చేయాల్సి ఉంటుంది.
ఒకటికంటే ఎక్కువ వైద్య విభాగాల్లో ఆర్ఎంపీలు ప్రాక్టీస్ చేసినా.. ఒకేసారి ఒకే విభాగంలో మాత్రమే విధులు నిర్వర్తించాలి. గతంలో కేవలం ఫస్ట్ ఎయిడ్ కి మాత్రమే ఆర్ఎంపీలకు అనుమతి ఉండగా.. ఇప్పుడు ఎమర్జెన్సీ వైద్య చికిత్స కూడా అందించే అవకాశం కల్పించింది ఎన్ఎంసీ. రోగి లేదా రోగి బంధువులు దాడి చేస్తే వైద్యం నిరాకరించేందుకు కూడా ఎన్ఎంసీ ఆర్ఎంపీలకు వెసులుబాటు ఇచ్చింది. మొత్తమ్మీద ఆర్ఎంపీలు ఇకపై మెడికల్ డాక్టర్లుగా చలామణీ కావొచ్చనమాట.