వచ్చేనెల 18న రాష్ట్రపతి ఎన్నికలు
రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ ను గురువారం నాడు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ విడుదల చేశారు. వచ్చే నెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి. 21వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఎన్నికల సంఘం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఈ షెడ్యూల్ ప్రకటించారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో […]
రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ ను గురువారం నాడు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ విడుదల చేశారు. వచ్చే నెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి. 21వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఎన్నికల సంఘం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఈ షెడ్యూల్ ప్రకటించారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగుస్తుంది.
15 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగడానికి ఒక రోజు ముందు ఈ ప్రకటన వెలువడింది.
జులై 25న కొత్త రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరిస్తారు. మొత్తం ఎలాక్టోరల్ కాలేజీ ఓట్ల విలువ 10.98.903 ఓట్లు 5.34.680 ఓట్లు పొందిన అభ్యర్థి రాష్ట్రపతిగా గెలుస్తారు.
పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నుకోబడిన సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు మరియు జాతీయ రాజధాని ఢిల్లీ మరియు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంతో సహా అన్ని రాష్ట్రాల శాసనసభల సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు