పర్యావరణ పనితీరులో భారత్ ర్యాంక్ ఘోరం.. పరిశోధనే తప్పంటున్న కేంద్రం..
ఎన్విరాన్ మెంటల్ పర్ఫామెన్స్ ఇండెక్స్(ఈపీఐ)లో 180 దేశాల జాబితాలో భారత్ 165వ స్థానంలో అట్టడుగున ఉంది. పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల్లో భారత్ ప్రదర్శన మరీ పేలవంగా ఉందని ఈపీఐ పరిశోధన తేల్చి చెప్పింది. ఎర్త్ యూనివర్శిటీ ఆఫ్ ఏల్, కొలంబియా యూనివర్శిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పరిశోధన చేపట్టారు శాస్త్రవేత్తలు. ఇండియాకు ఘోరమైన ర్యాంక్ ఇచ్చారు. అయితే ఈ ర్యాంక్ విషయంలో భారత ప్రభుత్వం ఆ పరిశోధననే తప్పుబడుతోంది. విశ్లేషణ సరిగా లేదని ఆరోపిస్తోంది. ఆర్థిక […]
ఎన్విరాన్ మెంటల్ పర్ఫామెన్స్ ఇండెక్స్(ఈపీఐ)లో 180 దేశాల జాబితాలో భారత్ 165వ స్థానంలో అట్టడుగున ఉంది. పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల్లో భారత్ ప్రదర్శన మరీ పేలవంగా ఉందని ఈపీఐ పరిశోధన తేల్చి చెప్పింది. ఎర్త్ యూనివర్శిటీ ఆఫ్ ఏల్, కొలంబియా యూనివర్శిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పరిశోధన చేపట్టారు శాస్త్రవేత్తలు. ఇండియాకు ఘోరమైన ర్యాంక్ ఇచ్చారు. అయితే ఈ ర్యాంక్ విషయంలో భారత ప్రభుత్వం ఆ పరిశోధననే తప్పుబడుతోంది. విశ్లేషణ సరిగా లేదని ఆరోపిస్తోంది.
ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, పర్యావరణాన్ని పట్టించుకోకపోవడంతో భారత్, వియత్నాం, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లో పర్యావరణానికి ఎక్కువ హాని జరుగుతోందని ఈపీఐ సూచీ చెబుతోంది. అయితే ఈపీఐ సేకరించిన వివరాలు, పరిశోధనలో భాగంగా తీసుకున్న గణాంకాలు తప్పుల తడక అని కేంద్రం వాదిస్తోంది. అడవులు, చిత్తడి నేలల వివరాలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని చెప్పింది కేంద్రం. అందుకే ఈ ర్యాంకింగ్స్ ని తాము పరిగణలోకి తీసుకోవట్లేదని అంటోంది.
వాస్తవాలేంటి..?
భారత్ లో పర్యావరణానికి తగిన ప్రధాన్యత ఇస్తున్నారా లేదా అనే విషయంపై కేంద్రం తనని తాను సమర్థించుకుంటోంది. అదే సమయంలో ప్రపంచ సంస్థలు మాత్రం భారత విధానాల వల్ల ప్రయోజనం శూన్యం అని నివేదికల ద్వారా చెబుతున్నాయి. ఇప్పుడు ఆ నివేదికలనే కేంద్రం తప్పుబడుతోంది. కర్బన ఉద్గారాల విషయంలో భారత టార్గెట్ ని పరిగణలోకి తీసుకోలేదని, పదేళ్ల సగటు ద్వారా భవిష్యత్తుని అంచనా వేయడం సరికాదంటోంది కేంద్రం.
వ్యవసాయం, జీవవైవిధ్యం, భూసారం, ఆహార వృథా వంటి వాటిని పరిగణలోకి తీసుకోలేదని, అభివృద్ధి చెందుతున్న దేశాల విషయంలో ఇవి చాలా ముఖ్యమని కేంద్ర పర్యావరణ శాఖ చెబుతోంది. సమగ్రంగా లేని నివేదికతో అంతర్జాతీయంగా భారత్ ను తగ్గించి చూపాలనుకోవడం సరికాదని అంటోంది. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.