Telugu Global
National

రోజువారీ కరోనా కేసుల్లో భారీ పెరుగుదల… ఆ రెండు రాష్ట్రాలే కీలకం..

దేశంలో మరోసారి కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఆమధ్య రోజువారీ కేసుల సంఖ్య 2వేల దిగువన స్థిరంగా ఉంది. ఓ దశలో 4వేలు దాటితే ఫోర్త్ వేవ్ అనే భయాలు కూడా ఏర్పడ్డాయి. ఇప్పుడు ఏకంగా రోజువారీ కేసుల సంఖ్య 7వేలు దాటేసింది. బుధవారం ఉదయం విడుదల చేసిన గణాంకాలలో 5233 మందికి కొవిడ్ సోకినట్టు నిర్థారణ కాగా.. గురువారం ఉదయానికి విడుదల చేసిన గణాంకాలలో గడచిన 24గంటల్లో నమోదైన కొత్త కేసుల సంఖ్య 7240కి చేరింది. […]

huge-increase-in-daily-corona-cases-those-two-states-are-the-key
X

దేశంలో మరోసారి కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఆమధ్య రోజువారీ కేసుల సంఖ్య 2వేల దిగువన స్థిరంగా ఉంది. ఓ దశలో 4వేలు దాటితే ఫోర్త్ వేవ్ అనే భయాలు కూడా ఏర్పడ్డాయి. ఇప్పుడు ఏకంగా రోజువారీ కేసుల సంఖ్య 7వేలు దాటేసింది. బుధవారం ఉదయం విడుదల చేసిన గణాంకాలలో 5233 మందికి కొవిడ్ సోకినట్టు నిర్థారణ కాగా.. గురువారం ఉదయానికి విడుదల చేసిన గణాంకాలలో గడచిన 24గంటల్లో నమోదైన కొత్త కేసుల సంఖ్య 7240కి చేరింది. బుధవారం కంటే ఇది 40శాతం అధికం. తాజా కేసులతో మొత్తం భారత్ లో కరోనా బాధితుల సంఖ్య 4,31,97,522కు చేరింది. ఇందులో 4,26,40,301 మంది ఇప్పటి వరకు కోలుకోగా.. 5,24,723 మంది మృతిచెందారు.

యాక్టివ్ కేసుల సంఖ్య ఎంతంటే..?

రోజువారీ కేసులు పెరుగుతుండటంతో.. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. దేశంలో ప్రస్తుతం 32,498 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది. గడచిన 24 గంటల్లో కరోనాకు ఎనిమిది మంది బలి కాగా.. 3591 మంది బాధితులు కోలుకున్నారు.

ఆ రెండు రాష్ట్రాలే కీలకం..

కొత్తగా నమోదైన కేసుల్లో సగానికిపైగా మహారాష్ట్ర, కేరళ నుంచి వెలుగు చూశాయి. మహారాష్ట్రలో 2701 కేసులు నమోదు కాగా, కేరళలో 2271, ఢిల్లీలో 564, కర్నాటకలో 376, హర్యానాలో 247 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో పాజిటివిటీ రేటు 1.62కు చేరింది. యాక్టివ్‌ కేసులు 0.08 శాతంగా ఉండగా, రికవరీ రేటు 98.71 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇక వ్యాక్సినేషన్ విషయానికొస్తే.. భారత్ లో ఇప్పటి వరకు 194,59,81,691 కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశారు.

First Published:  9 Jun 2022 5:22 AM IST
Next Story