Telugu Global
NEWS

పరీక్ష పేపర్లు తయారు చేసింది, దిద్దింది వైసీపీ నేతలు కాదు – పేర్ని నాని

ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల తర్వాత అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. గతంలో పరీక్ష ఫలితాల విషయంలో ఎప్పుడూ ఇంత రాద్ధాంతం, ఇంత చర్చ జరిగిన సందర్భాలు లేవు. కానీ ఈసారి మాత్రం ప్రభుత్వ వైఫల్యంతోనే ఫలితాలు తక్కువగా వచ్చాయని ప్రతిపక్షం దుమ్మెత్తి పోస్తోంది. దీనికి విరుగుడుగా.. వైసీపీ నేతలు కౌంటర్లు ఇవ్వడం మొదలు పెట్టారు. పరీక్ష పేపర్లు తయారు చేసింది, కరెక్షన్ చేసింది టీచర్లేనని, పవన్ కల్యాణ్ […]

పరీక్ష పేపర్లు తయారు చేసింది, దిద్దింది వైసీపీ నేతలు కాదు – పేర్ని నాని
X

ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల తర్వాత అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. గతంలో పరీక్ష ఫలితాల విషయంలో ఎప్పుడూ ఇంత రాద్ధాంతం, ఇంత చర్చ జరిగిన సందర్భాలు లేవు. కానీ ఈసారి మాత్రం ప్రభుత్వ వైఫల్యంతోనే ఫలితాలు తక్కువగా వచ్చాయని ప్రతిపక్షం దుమ్మెత్తి పోస్తోంది. దీనికి విరుగుడుగా.. వైసీపీ నేతలు కౌంటర్లు ఇవ్వడం మొదలు పెట్టారు.

పరీక్ష పేపర్లు తయారు చేసింది, కరెక్షన్ చేసింది టీచర్లేనని, పవన్ కల్యాణ్ పొరపాటుగా వైసీపీ నేతలు ఆ పని చేశారని అనుకుంటున్నారని, అందుకే గ్రేస్ మార్కులు కలపాలంటున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పేర్ని నాని.

పవన్ కల్యాణ్ కూడా పదో తరగతి ఫెయిలయ్యారని, అందుకే ఆయనకి ఫెయిలైన విద్యార్థులంటే అభిమానం అంటూ చురకలంటించారు. పరీక్ష తప్పిన విద్యార్థులకు 10 గ్రేస్ మార్కులు కలిపి పాస్ చేయించాలంటూ పవన్ కల్యాణ్ చేసిన ప్రపోజల్ కి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ఫెయిలైన విద్యార్థుల్ని చూస్తే పవన్ కల్యాణ్ కి.. స్వజాతి పక్షులం అనే ఫీలింగ్ కలుగుతుందని చెప్పారు నాని. చదువుకుంటే ఎవరైనా పాస్ అవుతారనే విషయం పవన్ కల్యాణ్ గ్రహించాలని, గ్రేస్ మార్కుల గోలేంటని ప్రశ్నించారు.

గత రెండేళ్లుగా కొవిడ్ కారణంగా పరీక్షలు లేకుండానే టెన్త్ విద్యార్థులను పాస్ చేయించారు. కొవిడ్ తర్వాత తొలిసారిగా పరీక్షలు పెట్టడంతో ఉత్తీర్ణత శాతం భారీగా పడిపోయింది. దీంతోపాటు, పరీక్షల నిర్వహణ సమయంలో కూడా పేపర్ లీకేజీ వార్తలు గందరగోళాన్ని సృష్టించాయి.

దీంతో ప్రతిపక్షాలు విమర్శల దాడి పెంచాయి. ఉపాధ్యాయులను బోధనేతర విధులకు వాడుకుంటున్నారని, అందుకే ఫలితాలు తక్కువగా వచ్చాయని విమర్శించారు పవన్ కల్యాణ్. ఫెయిలైన విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపాలని, రీ కౌంటింగ్, సప్లిమెంటరీకి ఫీజులు వసూలు చేయొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు పవన్ కి గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. పవన్ కూడా పది ఫెయిలయ్యారని, అందుకే ఆయనకు ఫెయిల్యూర్ స్టూడెంట్స్ పై అభిమానం ఉందంటూ.. సెటైర్లు వేశారు మాజీ మంత్రి పేర్ని నాని.

First Published:  9 Jun 2022 2:07 AM IST
Next Story