పవన్ కల్యాణ్ ట్వీట్ వెనుక ఆంతర్యమేంటో?
తాజాగా పవన్ కల్యాణ్ పెట్టిన ఓ ట్వీట్ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. జర భద్రం అంటూ ఆయన కార్యకర్తలను అలర్ట్ చేశారు. ‘అప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు సడెన్‌గా మనల్ని పొగడటం ప్రారంభిస్తారు. పొగడ్తలను నిజమనుకుంటే ప్రమాదంలో పడ్డట్టే.. ఆ నాయకుడు మారిపోయాడు, పరివర్తన చెందాడని మనం భావించి చప్పట్లు, ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల ట్రాప్ లో పడ్డట్టే’ అంటూ ఆయన ట్వీట్. దీంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సడెన్ […]
తాజాగా పవన్ కల్యాణ్ పెట్టిన ఓ ట్వీట్ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. జర భద్రం అంటూ ఆయన కార్యకర్తలను అలర్ట్ చేశారు.
‘అప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు సడెన్‌గా మనల్ని పొగడటం ప్రారంభిస్తారు. పొగడ్తలను నిజమనుకుంటే ప్రమాదంలో పడ్డట్టే.. ఆ నాయకుడు మారిపోయాడు, పరివర్తన చెందాడని మనం భావించి చప్పట్లు, ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల ట్రాప్ లో పడ్డట్టే’ అంటూ ఆయన ట్వీట్. దీంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల సడెన్ గా పవన్ కల్యాణ్ మీద, లేదంటే జనసైనికుల మీద అంత ప్రేమ కనబరిచిన నాయకులు ఎవరూ కనిపించడం లేదు. దీంతో ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారా? అని అంతా ఆలోచనలో పడ్డారు.
ఇటీవల పవన్ కల్యాణ్ పొత్తులపై కొన్ని ప్రతిపాదనలు తెరమీదకు తీసుకొచ్చారు. పవన్ ప్రపోజల్ మీద టీడీపీ నేతలెవరూ పెద్దగా స్పందించడం లేదు. ప్రస్తుతం ఈ విషయంలో సైలెంట్ గా ఉండాలని చంద్రబాబు ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం.
మరోవైపు జనసైనికులు తమ నేత పవన్ కల్యాణ్ ను బీజేపీ, జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటించాలంటూ బాహాటంగా డిమాండ్లు చేస్తున్నారు. దీన్ని బీజేపీ కూడా లైట్ తీసుకుంది. ఇప్పటికిప్పుడు ప్రకటించే అవకాశం లేదని తేల్చిచెప్పింది. ఇదిలా ఉంటే పవన్ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేసింది.. అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు.