‘పబ్జీ’ వద్దన్నందుకు .. తల్లిని చంపిన కొడుకు
పబ్జీ యువత జీవితాలను సర్వనాశనం చేస్తున్నదన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ దిక్కుమాలిన ఆటకు ఎంతోమంది యువత బలయ్యారు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకొని ప్రాణాలు తీసుకుంటున్నారు. తమ పిల్లలు నిత్యం పబ్జీకి బానిసలు అవుతుండటంతో తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు కౌన్సెలింగ్ కూడా ఇప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ యవకుడు పబ్జీ ఆడోద్దన్నందుకు తన తల్లినే హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకున్నది. […]
పబ్జీ యువత జీవితాలను సర్వనాశనం చేస్తున్నదన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ దిక్కుమాలిన ఆటకు ఎంతోమంది యువత బలయ్యారు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకొని ప్రాణాలు తీసుకుంటున్నారు. తమ పిల్లలు నిత్యం పబ్జీకి బానిసలు అవుతుండటంతో తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలు పోవడం లేదు.
కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు కౌన్సెలింగ్ కూడా ఇప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ యవకుడు పబ్జీ ఆడోద్దన్నందుకు తన తల్లినే హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకున్నది.
లక్నోలో సాధన అనే మహిళ .. తన కుమారుడు (16), కూతురు (10)తో కలిసి ఉంటోంది. ఆమె భర్త ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే కొడుకు పబ్జీకి బానిస కావడంతో అతడిని పలుమార్లు వారించింది. ఇటీవల కొడుకు మరీ ఎక్కువగా పబ్జీకి బానిసై నిత్యం ఫోన్ తో గడుపుతున్నాడు. దీంతో తల్లి అతడిని మందలించింది.
దీంతో శనివారం రాత్రి.. ఆ బాలుడు తన తండ్రి సర్వీస్ రివాల్వర్‌తో తల్లిని చంపేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ తన చెల్లిని బెదిరించాడు. ఇక మృతదేహాన్ని ఇంట్లోని దాచి.. దుర్వాసన రాకుండా రూమ్ ఫ్రెషనర్ లు కొట్టాడు. కాగా రెండ్రోజుల తర్వాత తండ్రికి ఫోన్ చేసి.. తన తల్లిని ఎలక్ట్రీషియన్ చంపేశాడని అబద్ధం చెప్పాడు.
తండ్రి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. బాలుడి ప్రవర్తనపై అనుమానం రావడంతో.. అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ జరపగా.. నేరం ఒప్పుకున్నాడు. కాగా పిల్లల ప్రవర్తన పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ALSO READ : ఆన్ లైన్ పాఠాలు ఇక చాలు..