బాలిక గ్యాంగ్ రేప్.. మనమడు గురించి హోం మంత్రి మహుమూద్ అలీ ఏమన్నారంటే..
దేశవ్యాప్తంగా జూబ్లీహిల్స్‌లో బాలికపై గ్యాంగ్ రేప్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన ఒక వ్యక్తితో పాటు ఐదుగురు మైనర్లను పోలీసులు అరెస్టు చేసినట్లు మంగళవారం ప్రకటించారు. కాగా, తొలి సారిగా దీనిపై తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ స్పందించారు. మైనర్ బాలిక రేప్ కేసులో తన మనమడు ఉన్నాడంటూ కొందరు అనవసరపు ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్ వ్యవహారంతో తన మనుమడికి సంబంధం లేకపోయినా రాద్దాంతం […]
దేశవ్యాప్తంగా జూబ్లీహిల్స్‌లో బాలికపై గ్యాంగ్ రేప్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన ఒక వ్యక్తితో పాటు ఐదుగురు మైనర్లను పోలీసులు అరెస్టు చేసినట్లు మంగళవారం ప్రకటించారు. కాగా, తొలి సారిగా దీనిపై తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ స్పందించారు.
మైనర్ బాలిక రేప్ కేసులో తన మనమడు ఉన్నాడంటూ కొందరు అనవసరపు ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్ వ్యవహారంతో తన మనుమడికి సంబంధం లేకపోయినా రాద్దాంతం చేశారని ఆయన మండిపడ్డారు.
ఇప్పుడు తన కుటుంబ సభ్యుల్లో ఎవరికీ ఈ వ్యవహారంతో సంబంధం లేదని తేలిందని ఆయన చెప్పారు. ఇక ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఈ కేసులో ఉన్నాడు. అయితే ఆయన కొడుకుపై కేసు వేరు.. రాజకీయ సంబంధాలు వేరని మంత్రి చెప్పుకొచ్చారు.
ఇక వక్ఫ్ బోర్డ్ చైర్మన్‌ను తొలగించాలనే డిమాండ్లు వస్తున్నాయని, కానీ ఆ పదవి బోర్డు ద్వారా భర్తీ అయ్యింది. ఇప్పుడు అతడిని తొలగించాలంటే బోర్డు నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని హోం మంత్రి స్పష్టం చేశారు.
తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకంపై దృష్టి పెట్టాలని మహమూద్ అలీ సూచించారు. ఇలాంటి సంఘటనలు జరిగితే చాలా బాధ వేస్తుందని అన్నారు. ఇది రాష్ట్రానికి, దేశానికి మంచిది కాదని చెప్పారు. ఈ కేసులో తెలంగాణ పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తున్నారని, దేశంలోనే మన రాష్ట్ర పోలీసులు నెంబర్ వన్ అని హోం మంత్రి చెప్పుకొచ్చారు.