Telugu Global
National

ఎక్కువ, తక్కువలు లేవు.. అంతా ఒకటే.. తమిళనాడులో సమానత గ్రామాలు

గ్రామం అంటే.. అందులో పేదవాళ్లుంటారు, గొప్పవారుంటారు, ఒకరి ఇల్లు పూరి గుడిసె, ఇంకొకరి ఇల్లు బంగ్లా. ఇలా రకరకాల భేదాలుంటాయి. కానీ ఆ గ్రామంలో అంతా ఒకటే, అందరూ సమానమే. అలాంటి ఆదర్శ భావాలున్నవారందర్నీ ఒకేచోట చేర్చి వారికోసం గ్రామాలనే రూపొందిస్తోంది తమిళనాడు ప్రభుత్వం. ఈక్వాలిటీ విలేజెస్ పేరుతో సరికొత్త చరిత్రను లిఖిస్తున్నారు సీఎం స్టాలిన్. తన తండ్రి కరుణానిధి.. “పెరియార్ మెమోరియల్ ఈక్వాలిటీ విలేజ్ స్కీమ్” పేరుతో దీన్ని లాంఛనంగా ప్రారంభించారని, ఇప్పుడు దాన్ని తాను […]

ఎక్కువ, తక్కువలు లేవు.. అంతా ఒకటే.. తమిళనాడులో సమానత గ్రామాలు
X

గ్రామం అంటే.. అందులో పేదవాళ్లుంటారు, గొప్పవారుంటారు, ఒకరి ఇల్లు పూరి గుడిసె, ఇంకొకరి ఇల్లు బంగ్లా. ఇలా రకరకాల భేదాలుంటాయి. కానీ ఆ గ్రామంలో అంతా ఒకటే, అందరూ సమానమే.

అలాంటి ఆదర్శ భావాలున్నవారందర్నీ ఒకేచోట చేర్చి వారికోసం గ్రామాలనే రూపొందిస్తోంది తమిళనాడు ప్రభుత్వం. ఈక్వాలిటీ విలేజెస్ పేరుతో సరికొత్త చరిత్రను లిఖిస్తున్నారు సీఎం స్టాలిన్.

తన తండ్రి కరుణానిధి.. “పెరియార్ మెమోరియల్ ఈక్వాలిటీ విలేజ్ స్కీమ్” పేరుతో దీన్ని లాంఛనంగా ప్రారంభించారని, ఇప్పుడు దాన్ని తాను బలోపేతం చేస్తున్నానని చెప్పారు సీఎం స్టాలిన్. తాజాగా ఆయన.. శివగంగ జిల్లాలోని కన్నమంగళంపట్టి పంచాయతీకి సమీపంలో “పెరియార్ సమతువపురం” పేరుతో ఈక్వాలిటీ విలేజ్ ని ప్రారంభించారు.

ఈక్వాలిటీ విలేజ్ అంటే ఏంటి..?

మొత్తం ఇందులో 100 ఇళ్లు ఉంటాయి. ఎస్సీలకు 40 ఇల్లు, బీసీలకు 25, ఎంబీసీలకు 25, ఇతరులకు 10 ఇళ్లు ఇందులో కేటాయిస్తారు. ఒక్కో ఇంటిని రూ.1.92 లక్షల వ్యయంతో నిర్మిస్తారు. తాగునీటి సరఫరా కోసం 18 లక్షల రూపాయలు కేటాయిస్తారు.

లక్షా 10వేల రూపాయలతో క్రీడా మైదానం, ఐదున్నర లక్షలతో పిల్లలకు పార్క్ నిర్మిస్తారు. అన్ని ఇళ్లు ఒకేరకంగా ఉంటాయి. లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించి వదిలేయకుండా.. అక్కడ నివాసం ఉండేట్లు కూడా అన్ని సౌకర్యాలు కల్పించడంతో ఈక్వాలిటీ విలేజ్ కాన్సెప్ట్ తమిళనాడులో విజయవంతం అవుతోంది.

అన్నాడీఎంకే హయాంలో ఈ పథకాన్ని పూర్తిగా పక్కనపెట్టారని, ఇప్పుడు తమ హయాంలో మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా ఈక్వాలిటీ విలేజెస్ ని తెరపైకి తెస్తున్నామని అన్నారు స్టాలిన్. అసలు తమిళనాడు మొత్తంగా ఇలా మారిపోవాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

First Published:  8 Jun 2022 2:38 PM IST
Next Story