Telugu Global
NEWS

ఏపీలో టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

ఏపీలో టెన్త్ పరీక్షలు రాసి ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇటీవల పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేయగా.. 67.26 శాతం మంది పాస్ అయ్యారు. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ సారి విద్యార్థులు పరీక్ష తప్పారు. ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం నెల రోజుల్లోపు సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతే, కాకుండా వారికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. తాజాగా […]

AP SSC 2022
X

ఏపీలో టెన్త్ పరీక్షలు రాసి ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇటీవల పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేయగా.. 67.26 శాతం మంది పాస్ అయ్యారు. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ సారి విద్యార్థులు పరీక్ష తప్పారు. ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం నెల రోజుల్లోపు సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతే, కాకుండా వారికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. తాజాగా వారికి మరింత ఊరట కలిగించే నిర్ణయాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్నది.

ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీకి ముందు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ చేయించుకునే అవకాశాన్ని కల్పించారు. ఇక సప్లిమెంటరీ పరీక్షలు రాసి పాసైయ్యే విద్యార్థుల మార్కుల మెమోల్లో కంపార్ట్‌మెంటల్ అని మెన్షన్ చేయరు. సప్లిమెంటరీలో ఎన్ని మార్కులు వస్తే.. వాటిని పరిగణలోకి తీసుకొని ఇంతకు ముందు పాసైన వారిలాగే గ్రేడ్లు కేటాయిస్తారు. ఈ విషయంపై విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నది. దీని వల్ల ఫెయిల్ అయిన విద్యార్థులకు లాభం కలుగనున్నదని అంటున్నారు.

ఇక టెన్త్ పాసైన విద్యార్థులు తమ మెమోలు వెబ్‌సైట్ ద్వారా తీసుకోవచ్చని విద్యాశాఖ చెప్తోంది. www.bse.ap.gov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇక విద్యార్థులు ఈ నెల 20లోపు రూ. 500 చెల్లించి రీకౌంటింగ్, రూ. 1,000 చెల్లించి రీవెరిఫికేషన్ చేయించుకోవచ్చని స్పష్టం చేసింది. రూ. 1000 చెల్లించి జవాబు పత్రాల జిరాక్స్ కాపీలను కూడా పొందొచ్చని తెలిపింది.

ALSO READ: టీడీపీలో ముఠా తగాదాలు.. టికెట్లు ఆశించే అభ్యర్థులకు బాబు వార్నింగ్

First Published:  8 Jun 2022 7:18 AM IST
Next Story