Telugu Global
National

మీ స్మార్ట్ ఫోన్‌లో ఈ పొరపాటు చేస్తున్నారా? జాగ్రత్త అంటున్న టెక్ నిపుణులు

ఇప్పుడు అందరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్లు దర్శనం ఇస్తున్నాయి. ఫీచర్ ఫోన్ల వాడకం గణనీయంగా తగ్గిపోయింది. రూ.5 వేల నుంచే మంచి స్మార్ట్ ఫోన్లు లభిస్తుండటంతో అందరూ వాటినే వాడుతున్నారు. వీటిలో అనేక ఫీచర్లు ఉండటంతో పాటు.. ఆన్‌లైన్ పేమెంట్స్‌, సోషల్ మీడియాకు ఉపయోగపడుతుండటంతో చాలా మంది స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్లు వాడకంలో చాలా జాగ్రత్తలు పాటించాలని టెక్ నిపుణులు చెప్తున్నారు. స్మార్ట్ ఫోన్‌లో జీపీఎస్ (GPS) ఆప్షన్ యాక్టివేట్‌లో ఉంటే […]

మీ స్మార్ట్ ఫోన్‌లో ఈ పొరపాటు చేస్తున్నారా? జాగ్రత్త అంటున్న టెక్ నిపుణులు
X

ఇప్పుడు అందరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్లు దర్శనం ఇస్తున్నాయి. ఫీచర్ ఫోన్ల వాడకం గణనీయంగా తగ్గిపోయింది. రూ.5 వేల నుంచే మంచి స్మార్ట్ ఫోన్లు లభిస్తుండటంతో అందరూ వాటినే వాడుతున్నారు. వీటిలో అనేక ఫీచర్లు ఉండటంతో పాటు.. ఆన్‌లైన్ పేమెంట్స్‌, సోషల్ మీడియాకు ఉపయోగపడుతుండటంతో చాలా మంది స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్లు వాడకంలో చాలా జాగ్రత్తలు పాటించాలని టెక్ నిపుణులు చెప్తున్నారు.

స్మార్ట్ ఫోన్‌లో జీపీఎస్ (GPS) ఆప్షన్ యాక్టివేట్‌లో ఉంటే ఇబ్బందులు తప్పవని అంటున్నారు. జీపీఎస్ ఆన్ చేసి ఉండటం వల్ల ఫోన్ లోని యాప్‌లు మన లోకేషన్‌ను ఎప్పటికప్పుడు ట్రేస్ చేస్తుంటాయి. మన లోకేషన్ ఆధారంగా టార్గెటెడ్ యాడ్స్ పంపుతుంటాయి. ఇవి చాలా ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నది. కాబట్టి అవసరమైనప్పుడు తప్ప జీపీఎస్‌ను ఆన్ చేయవద్దని నిపుణులు చెప్తున్నారు.

ఫేస్‌బుక్, గూగుల్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి యాప్స్ ఎక్కువగా జీపీఎస్‌ను ట్రాక్ చేస్తుంటాయి. ఈ ప్లాట్‌ఫామ్స్‌కు అన్నింటినీ ట్రాక్ చేసే సామర్థ్యం ఉంటుంది. మనం ఎక్కడెక్కడ తిరిగాము, మన డైలీ రొటీన్ ఏంటనేవి కూడా ఈ యాప్స్ పసి గడతాయి. ఇది కచ్చితంగా మన ప్రైవసీకి భంగం కలిగించే విషయమే. కానీ ఆ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడే మనం వాటికి జీపీఎస్ పర్మిషన్ ఇచ్చేసి ఉంటాం కాబట్టి.. అవి ట్రాక్ చెయ్యకూడదు అంటే వాటిని డిలీట్ చేయాలి. లేదంటే జీపీఎస్ ఆఫ్ చేయడం ఒక్కటే మార్గం.

జీపీఎస్‌ను మనకు ప్రమాదం లేని విధంగా సెట్ చేసుకోవడానికి ఇలా చేయండి. ముందు ఫోన్ సెట్టింగ్స్ (Settings) ఓపెన్ చేసి లిస్ట్‌లో యాప్స్ (Apps) ను క్లిక్ చేయండి. అందులో ‘Permission Manager’ పైన క్లిక్ చేస్తే మనకు లొకేషన్ అనే ట్యాప్ కనిపిస్తుంది. అప్పుడు మనం ఏయే యాప్స్‌కు లొకేషన్ పర్మిషన్ ఇచ్చామో తెలుస్తుంది. మనం అవసరం అనుకున్న వాటికి తప్ప మిగిలిన వాటన్నింటికీ మాన్యువల్‌గా జీపీఎస్ ఆఫ్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.

కాగా, గూగుల్ మ్యాప్స్ ఉపయోగించాలన్నా.. జొమాటో, స్విగ్గీ, ఓలా, ఉబర్ వంటి వాటిని వాడాలన్నా జీపీఎస్ తప్పని సరిగా అవసరం అవుతుంది. కాబట్టి.. అలాంటి యాప్స్‌కు కేవలం వాడేటప్పుడు మాత్రమే ఆన్ అయ్యేలా సెట్టింగ్స్ ఛేంజ్ చేసుకుంటే సరిపోతుంది.

First Published:  8 Jun 2022 2:13 PM IST
Next Story