‘గడప గడపకు’ నిరంతర కార్యక్రమం – వచ్చే ఎన్నికల్లో 175 సీట్లూ గెలవాలి
‘గడప గడపకు మన ప్రభుత్వం’ అనేది నిరంతర కార్యక్రమమని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. గడప గడపకు మనం కార్యక్రమంపై బుధవారం ఆయన ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి కీలక సూచనలు చేశారు. ‘వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో మనమే గెలవాలి. ఇదే మన టార్గెట్. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలుస్తామని ఊహించామా? కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకోగలమనుకున్నామా? కానీ ప్రణాళికా బద్ధంగా పనిచేశాం. అందుకే గెలుపు సాధ్యమైంది. వచ్చే […]
‘గడప గడపకు మన ప్రభుత్వం’ అనేది నిరంతర కార్యక్రమమని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. గడప గడపకు మనం కార్యక్రమంపై బుధవారం ఆయన ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి కీలక సూచనలు చేశారు. ‘వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో మనమే గెలవాలి. ఇదే మన టార్గెట్. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలుస్తామని ఊహించామా? కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకోగలమనుకున్నామా? కానీ ప్రణాళికా బద్ధంగా పనిచేశాం. అందుకే గెలుపు సాధ్యమైంది.
వచ్చే ఎన్నికల్లోనూ అంతే వ్యూహాత్మకంగా పనిచేద్దాం. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలుపొందడం పెద్ద విషయమేమీ కాదు. ఇక గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుంది. ప్రజల సమస్యలు విని వాటిని పరిష్కరించేందుకు చొరవ తీసుకోండి’ అంటూ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు.
ఇటీవల గడపగడపకు మన ప్రభుత్వం, సామాజిక న్యాయభేరి పేరిట వైసీపీ ప్రజల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఓ వర్గం మీడియా ఈ రెండు కార్యక్రమాలపై తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. గడపగడపకు మన కార్యక్రమంలో ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్నారని పేర్కొన్నది. మంత్రుల యాత్రకు జనం రావడం లేదని ప్రచారం మొదలుపట్టింది. ఈ విమర్శలను వైసీపీ సోషల్ మీడియా తిప్పికొట్టింది.
సభా ప్రాంగణానికి మంత్రులు రాకముందే ఫొటోలు తీసి వాటిని ప్రచారం చేశారని.. టీడీపీ కార్యకర్తలను ముందుకు పంపించి గడపగడపకు కార్యక్రమంలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారని వైసీపీ సోషల్ మీడియా ఆధారాలు బయటపెట్టింది. ఇటువంటి పరిస్థితుల మధ్య సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించారు. ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి కూడా ప్రత్యేకంగా సర్వే చేయించినట్టు సమాచారం.
ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత ఏమీ లేదని .. ప్రభుత్వం పట్ల మెజార్టీ ప్రజలు సంతృప్తిగానే ఉన్నట్టు సర్వేలో తేలినట్టు సమాచారం. ముఖ్యమంత్రి ఈ కాన్ఫిడెన్స్‌తోనే సమావేశంలో వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ గెలవాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆదేశించినట్టు సమాచారం.