అసదుద్దీన్ కు షాక్ ఇవ్వబోతున్న నలుగురు MIM ఎమ్మెల్యేలు ?
బీహార్‌లోని ఐదుగురు AIMIM ఎమ్మెల్యేలలో నలుగురు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి షాక్ ఇవ్వనున్నారా ? తమ పార్టీని పూర్తిగా మరో పార్టీలో విలీనం చేయనున్నారా ? అనే ప్రశ్నలకు నిజమే అని జవాబు ఇస్తున్నాయి రాజకీయ వర్గాలు. గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో MIM దాదాపు 20 సీట్లలో RJD ఓట్లను చీల్చి ఎన్డీఏ అభ్యర్థుల విజయానికి కారణమయ్యిందనే ఆరోపణలున్నాయి. అసలు MIM పార్టీ ప్రతి పక్షాల ఓట్లను చీల్చేందుకు బీజేపీకి బీ టీం […]
బీహార్‌లోని ఐదుగురు AIMIM ఎమ్మెల్యేలలో నలుగురు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి షాక్ ఇవ్వనున్నారా ? తమ పార్టీని పూర్తిగా మరో పార్టీలో విలీనం చేయనున్నారా ? అనే ప్రశ్నలకు నిజమే అని జవాబు ఇస్తున్నాయి రాజకీయ వర్గాలు.
గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో MIM దాదాపు 20 సీట్లలో RJD ఓట్లను చీల్చి ఎన్డీఏ అభ్యర్థుల విజయానికి కారణమయ్యిందనే ఆరోపణలున్నాయి. అసలు MIM పార్టీ ప్రతి పక్షాల ఓట్లను చీల్చేందుకు బీజేపీకి బీ టీం గా వ్యవహరిస్తోందనే ఆరోపణలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో 90 సీట్లలో పోటీ చేసిన MIM ఒక్క సీటును కూడా గెల్చుకోలేకపోవడం, అక్కడ 20 శాతం ముస్లిం ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ ఎంఐఎం కేవలం ఒకే ఒక్క శాతం ఓట్లకే పరిమితమవడం బీహార్ లోని ఆ పార్టీ ఎమ్మెల్యేలను ఆలోచనలో పడేసిందంటున్నారు.
తమ భవిష్యత్తుపై భయంతో ప్రస్తుతం MIM కు చెందిన ఎమ్మెల్యేలు మహ్మద్ ఇజార్ అస్ఫి, షహన్ వాజ్ ఆలమ్, సయ్యద్ రుక్నుద్దీన్, అజర్ నయీమీ లు తమ పార్టీని RJDలో విలీనం చేయడం కోసం ఆ పార్టీతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
2025 అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ ఓటర్లు కూడా యూపీ ఓటర్ల మాదిరిగా తమ పార్టీకి ఓట్లు వేయరేమో అనే అనుమానంతో వాళ్ళు నలుగురు MIMతో తెగతెంపులు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే మరో ఎమ్మెల్యే, ఆ పార్టీ బీహార్ శాఖ అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్ మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నారు. “బీహార్‌లో తమది చిన్న పార్టీ అయినందున, 2020 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుండి అన్ని పార్టీలు మా పార్టీ ఎమ్మెల్యేలను సంప్రదిస్తున్నాయి. అయితే, వారు ఎవ్వరూ పార్టీ మారలేదు ఇకపై కూడా మారబోరు” అన్నారు.
కాగా నలుగురు MIM ఎమ్మెల్యేలు RJDలో చేరితే అసెంబ్లీలో ఆ పార్టీ బలం 80 కి చేరి అదే అతిపెద్ద పార్టీగా రూపొందుతుంది. అంతే కాక ఆ పార్టీకి 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 16 లెఫ్ట్ ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.