ప్రభుత్వ వైద్యుల ప్రవేటు ప్రాక్టీస్ పై నిషేధం – తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు
ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకుండా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకుండా నిషేధం విధిస్తూ మంగళవారం తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ రూల్స్‌కు సవరణలు చేసింది. వివిధ అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల కోసం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఇకపై రిక్రూట్ అయిన వారికి ప్రైవేట్ ప్రాక్టీస్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. “ఇకపై డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా రిక్రూట్ చేయబడిన డాక్టర్లకు ప్రైవేట్ ప్రాక్టీస్‌పై పూర్తి నిషేధం […]
ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకుండా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకుండా నిషేధం విధిస్తూ మంగళవారం తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ రూల్స్‌కు సవరణలు చేసింది.
వివిధ అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల కోసం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఇకపై రిక్రూట్ అయిన వారికి ప్రైవేట్ ప్రాక్టీస్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.
“ఇకపై డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా రిక్రూట్ చేయబడిన డాక్టర్లకు ప్రైవేట్ ప్రాక్టీస్‌పై పూర్తి నిషేధం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత రిక్రూట్ చేయబడిన వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్‌కు అనుమతించబడరు” అని నోటిఫికేషన్ పేర్కొంది.
చాలా మంది ప్రభుత్వ డాక్టర్లు పూర్తి సమయం ఆస్పత్రుల్లో ఉండటం లేదని తమ సమయాన్ని ఎక్కువగా ప్రైవేటు ప్రాక్టీస్ కే కేటాయిస్తున్నారని గుర్తించిన ప్రభుత్వం ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ డాక్టర్ల వ్యతిరేకతతో అది అమ్లు కాలేదు.