Telugu Global
International

దక్షిణాఫ్రికాను కొల్లగొట్టిన ఇద్దరు భారతీయులను అరెస్టు చేసిన దుబాయ్

దక్షిణాఫ్రికాలో భారీ అవినీతికి పాల్పడ్డ ఇద్దరు భారత సంతతికి చెందిన వ్యాపారవేత్తలను దుబాయ్ లో అరెస్టు చేశారు. సోదరులైన రాజేష్ గుప్తా,అతుల్ గుప్తాలను దుబాయ్ లో అరెస్టు చేసినట్టు దక్షిణాఫ్రికా ప్రభుత్వం సోమవారం తెలిపింది. అయితే వీరి మరో సోదరుడు అజయ్ గుప్తా అరెస్టయ్యాడా లేదా అనే విషయం ఇంకా తెలియరాలేదు గుప్తా బ్రదర్స్ గా పేరుగాంచిన ఈ ముగ్గురు సోదరులది ఉత్తరప్రదేశ్ లోని షహరాన్ పూర్. 1990 లో వీరు దక్షిణాఫ్రికా వెళ్ళి షూ వ్యాపారం […]

దక్షిణాఫ్రికాను కొల్లగొట్టిన ఇద్దరు భారతీయులను అరెస్టు చేసిన దుబాయ్
X

దక్షిణాఫ్రికాలో భారీ అవినీతికి పాల్పడ్డ ఇద్దరు భారత సంతతికి చెందిన వ్యాపారవేత్తలను దుబాయ్ లో అరెస్టు చేశారు. సోదరులైన రాజేష్ గుప్తా,అతుల్ గుప్తాలను దుబాయ్ లో అరెస్టు చేసినట్టు దక్షిణాఫ్రికా ప్రభుత్వం సోమవారం తెలిపింది. అయితే వీరి మరో సోదరుడు అజయ్ గుప్తా అరెస్టయ్యాడా లేదా అనే విషయం ఇంకా తెలియరాలేదు

గుప్తా బ్రదర్స్ గా పేరుగాంచిన ఈ ముగ్గురు సోదరులది ఉత్తరప్రదేశ్ లోని షహరాన్ పూర్. 1990 లో వీరు దక్షిణాఫ్రికా వెళ్ళి షూ వ్యాపారం మొదలు పెట్టారు. ఆ తర్వాత వీళ్ళు అక్కడ మీడియా, మైనింగ్, ఐటీ తదితర అనేక రంగాల్లోకి అడుగుపెట్టి దక్షిణాఫ్రికాలోనే అత్యంత ధనవంతుల‌య్యారు.

దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమాను బుట్టలో వేసుకున్న వీళ్ళు ఆయనకు, ఆయన ప్రభుత్వంలోని మంత్రులకు, అధికారులకు మంచి స్నేహితులయ్యారు. ఆ సంబంధాలు ఉపయోగించుకొని ఈ గుప్తా సోదరులు అనేక అవినీతి కార్యక్రమాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నేషనల్ ఎలక్ట్రిసిటీ సప్లయర్స్ లాంటి అనేక ప్రభుత్వరంగ సంస్థలను కొల్లగొట్టి అక్రమంగా మన కరెన్సీలో 7,513 కోట్ల రూపాయలను కొల్లగొట్టారు.

ఈ సోదరుల అవినీతి అన్ని రంగాలకు వ్యాపించడంతో అధ్యక్షుడు జాకబ్ జుమాపై తీవ్ర వత్తిడి వచ్చింది. దాంతో ఆయన 2018లో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అదే సమయంలో ముగ్గురు సోదరులు కుటుంబాలతో సహా దుబాయ్ పారిపోయారు.

జూలై 2021లో వారి అరెస్ట్ కోసం ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు జారీ చేసింది. అయితే దక్షిణాఫ్రికాకు , UAEకి నేరస్తులను అప్పగించే ఒప్పందం లేకపోవడంతో అతన్ని తమ దేశానికి తీసుకరావడంలో దక్షిణాఫ్రికా విఫలమయ్యింది. 2021 సంవత్సరంలో ఆ దేశం UAE తో నేరస్తుల అప్పగింత ఒప్పందం చేసుకుంది. దాంతో దుబాయ్ అధికారులు ఇద్దరు గుప్తా సోదరులను అరెస్టు చేశారు. వీళ్ళిద్దరినీ త్వరలోనే దక్షిణాఫ్రికా తీసుకెళ్ళే అవకాశం ఉంది.

First Published:  7 Jun 2022 5:43 AM IST
Next Story