Telugu Global
National

పండిట్లందు.. బీజేపీ పండిట్లు వేరయా..! కాశ్మీర్ లో కమలదళం వివక్ష

కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులు.. పండిట్ల ప్రాణాలు తీస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రధాని ప్యాకేజీ కింద ఉద్యోగంలో చేరిన పండిట్లు.. తమని అక్కడినుంచి బదిలీ చేయాలని పట్టుబడుతున్నారు. కేంద్రం కొందరికి బదిలీ అవకాశం కల్పించింది కూడా. అయితే ఇక్కడే బీజేపీ చిన్న జిమ్మిక్కు చేసింది. పండిట్లందరికీ వారు బదిలీ ఆర్డర్లు ఇవ్వలేదు. కేవలం బీజేపీ నేతల బంధువులు, వారి స్నేహితులకు మాత్రమే కాశ్మీర్ లోయలోనుంచి బదిలీ అయ్యే అవకాశం కల్పించారు. దీంతో అక్కడ నిరసనలు భగ్గుమన్నాయి. కాశ్మీరీ […]

పండిట్లందు.. బీజేపీ పండిట్లు వేరయా..! కాశ్మీర్ లో కమలదళం వివక్ష
X

కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులు.. పండిట్ల ప్రాణాలు తీస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రధాని ప్యాకేజీ కింద ఉద్యోగంలో చేరిన పండిట్లు.. తమని అక్కడినుంచి బదిలీ చేయాలని పట్టుబడుతున్నారు. కేంద్రం కొందరికి బదిలీ అవకాశం కల్పించింది కూడా. అయితే ఇక్కడే బీజేపీ చిన్న జిమ్మిక్కు చేసింది. పండిట్లందరికీ వారు బదిలీ ఆర్డర్లు ఇవ్వలేదు. కేవలం బీజేపీ నేతల బంధువులు, వారి స్నేహితులకు మాత్రమే కాశ్మీర్ లోయలోనుంచి బదిలీ అయ్యే అవకాశం కల్పించారు. దీంతో అక్కడ నిరసనలు భగ్గుమన్నాయి. కాశ్మీరీ పండిట్లలో బీజేపీ పండిట్లకే మేలు జరుగుతోందని, తమ ప్రాణాలకు దిక్కెవరని మిగతా వారంతా ఆందోళనకు దిగారు.

పనామా చౌక్ అనే ప్రాంతం వద్ద వరుసగా ఆరో రోజు నిరసన కార్యక్రమాలు జరిగాయి. తమని ఇక్కడినుంచి బదిలీ చేయాలని, తమ ప్రాణాలు కాపాడాలని ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులకు మద్దతుగా ప్రేమ్ నాథ్ భట్ మెమోరియల్ సభ్యులు కూడా నిరసన కార్యక్రమాల్లో పొల్గొంటున్నారు. రజినీ బాలా అనే మహిళా టీచర్ హత్యోదంతం తర్వాత నిరసనలు పెల్లుబికాయి. అంబ్రీన్ భట్, రాహుల్ భట్.. ఇలా వరుసగా కాశ్మీరీ పండిట్ల వర్గానికి చెందిన వారిని ఉగ్రవాదులు హత్య చేస్తూనే ఉన్నారు. రజినీ బాలా డోగ్రా వర్గానికి చెందినవారు కావడంతో.. ఆ వర్గం ప్రజలు కూడా తమను లోయ దాటించమని వేడుకుంటున్నారు.

హిందువుల హత్యలు, రాజు సంబరాలు..
కాశ్మీర్‌ లో హిందువుల హత్యలపై కేంద్రప్రభుత్వం మౌనం వహించడాన్ని తీవ్రం ఖండిస్తున్నట్టు తెలిపారు శివసేన నేతలు. కాశ్మీర్ లో హిందువులు హత్యకు గురవుతుంటే రాజు (మోదీ) మాత్రం ఎనిమిదేళ్ల పాలన బాగుందని సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. హిందూత్వం, జాతీయవాదం అంటూ బీజేపీ నేతలు గొంతు చించుకుంటారని, కానీ హిందువులు నిజమైన ప్రమాదంలో ఉన్నప్పుడు వీళ్ల నోర్లు పెగలవు అంటూ సామ్నాలో ఘాటుగా విమర్శించారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ బాంబు లు ఎక్కడ పేలాయి, ఆర్టికల్‌ 370 నిర్వీర్యంతో ఏం సాధించారు, ఎంతమంది కాశ్మీర్‌ లో భూములు కొన్నారంటూ ప్రశ్నించారు.

నిర్లక్ష్యం ఒక ఎత్తు.. పక్షపాతం మరో ఎత్తు..
కాశ్మీర్ లోయనుంచి హిందువులను, ముఖ్యంగా పండిట్ వర్గానికి చెందిన వారిని తరలించేందుకు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఉంది. అయితే నిమ్మకు నీరెత్తినట్టు.. హత్యలు జరుగుతున్నా కూడా తూతూ మంత్రంగా కొంతమంది ఉద్యోగులను మాత్రమే బదిలీ చేసింది కేంద్రం. అందులోనూ బీజేపీ నేతల బంధువులకే ప్రాధాన్యత ఇవ్వడం మరో వివాదానికి కారణం అయింది.

First Published:  7 Jun 2022 10:02 AM IST
Next Story