Telugu Global
MOVIE UPDATES

నాని రియల్ లవ్ స్టోరీ ఇది

నిజజీవితంలో ప్రేమ పెళ్లి చేసుకున్నాడు నాని. అంటే సుందరానికి ప్రమోషన్ సందర్భంగా తన లవ్ మ్యారేజీ జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నాడు. అంటే సుందరానికి సినిమా టైపులో తన నిజజీవితంలో ఎలాంటి గొడవలు లేవని, కానీ తమ రెండు కుటుంబాల మధ్య చిన్న బేధాభిప్రాయాలు ఉన్నమాట నిజమేనన్నాడు నాని. “నా రియల్ లవ్ స్టోరీలో పెద్దగా సమస్యలు లేవు. నాది చాలా హ్యాపీ మ్యారేజ్. ఇరు కుటుంబాలు చక్కగా మాట్లాడుకొని వివాహం జరిపారు. కాకపోతే వాళ్ళది సైంటిస్ట్ ల ఫ్యామిలీ. […]

నాని రియల్ లవ్ స్టోరీ ఇది
X

నిజజీవితంలో ప్రేమ పెళ్లి చేసుకున్నాడు నాని. అంటే సుందరానికి ప్రమోషన్ సందర్భంగా తన లవ్ మ్యారేజీ జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నాడు. అంటే సుందరానికి సినిమా టైపులో తన నిజజీవితంలో ఎలాంటి గొడవలు లేవని, కానీ తమ రెండు కుటుంబాల మధ్య చిన్న బేధాభిప్రాయాలు ఉన్నమాట నిజమేనన్నాడు నాని.

“నా రియల్ లవ్ స్టోరీలో పెద్దగా సమస్యలు లేవు. నాది చాలా హ్యాపీ మ్యారేజ్. ఇరు కుటుంబాలు చక్కగా మాట్లాడుకొని వివాహం జరిపారు. కాకపోతే వాళ్ళది సైంటిస్ట్ ల ఫ్యామిలీ. నేను సినిమాలు చుట్టూ తిరుగుతున్నాను. మొదట్లో కొంచెం కంగారు పడ్డారు. ఆ తర్వాత నాపై వాళ్ళకు నమ్మకం కుదిరడంతో ఆనందంగా మా పెళ్లి జరిగింది.”

ఇలా తన ప్రేమ వివాహాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాడు నాని. ప్రస్తుతం తన కొడుకే తన సర్వస్వం అని, అతడ్ని చూడకుండా ఉండలేనన్నాడు నాని. ఇక సినిమాలో సుందర్ పాత్రకు అమెరికా వెళ్లాలనేది కోరిక. రియల్ లైఫ్ లో మాత్రం తనకు అలాంటి కోరిక లేదన్నాడు నాని.

ప్రస్తుతం తెలుగు సినిమాకు స్వర్ణయుగం నడుస్తోందన్నాడు నాని. తెలుగు సినిమాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయని, ఇలాంటి టైమ్ లో మరింత మంచి సినిమాలు రావాల్సిన ఆవశ్యకత ఉందన్నాడు.

First Published:  7 Jun 2022 9:26 AM IST
Next Story