Telugu Global
National

కర్ణాటకలోని ఓ వీధికి గాడ్సే పేరు – తీవ్ర వివాదాస్పదం

ప్రస్తుతం దేశంలో అత్యంత దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చరిత్రలో ద్రోహులుగా, హంతకులుగా ముద్రపడ్డవారిని గొప్పవాళ్లుగా చిత్రీకరిస్తున్నారు. స్వాతంత్రసమరయోధులను దేశ ద్రోహులుగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు వాట్సాప్ యూనివర్సిటీ ఎంతో దోహదం చేస్తోంది. వాట్సాప్ లో కొన్ని వార్తలు విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. వాటికి ఎటువంటి ఆధారాలు ఉండవు. కేవలం ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఇటువంటి ప్రచారం చేస్తున్నారు. కొందరు ఉన్నతవిద్యావంతులు కూడా .. నిజానిజాలు గమనించకుండా ఇటువంటి మెసేజ్ లను ఫార్వార్డ్ చేస్తుండటం […]

కర్ణాటకలోని ఓ వీధికి గాడ్సే పేరు  – తీవ్ర వివాదాస్పదం
X

ప్రస్తుతం దేశంలో అత్యంత దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చరిత్రలో ద్రోహులుగా, హంతకులుగా ముద్రపడ్డవారిని గొప్పవాళ్లుగా చిత్రీకరిస్తున్నారు. స్వాతంత్రసమరయోధులను దేశ ద్రోహులుగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు వాట్సాప్ యూనివర్సిటీ ఎంతో దోహదం చేస్తోంది. వాట్సాప్ లో కొన్ని వార్తలు విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. వాటికి ఎటువంటి ఆధారాలు ఉండవు. కేవలం ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఇటువంటి ప్రచారం చేస్తున్నారు.

కొందరు ఉన్నతవిద్యావంతులు కూడా .. నిజానిజాలు గమనించకుండా ఇటువంటి మెసేజ్ లను ఫార్వార్డ్ చేస్తుండటం గమనార్హం.ఇక ఇటీవల గుడులు, మసీదులకు సంబంధించిన అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. ప్రధాన మైన అంశాలను పక్కదోవ పట్టించేందుకు కొందరు ఉద్దేశ్యపూర్వకంగానే ఈ చర్చను లేవనెత్తారన్న వాదనా ఉంది.

ఇదిలా ఉంటే తాజాగా కర్ణాటకలో జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అక్కడ ఓ వీధికి ఏకంగా గాంధీని హత్యచేసిన గాడ్సే పేరు పెట్టారు. నిజానికి గాడ్సే ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి వచ్చిన వ్యక్తి. అతడిని పొగుడుతూ ఓ వర్గం తరుచూ పోస్టులు పెడుతూ ఉంటుంది.

బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఓ వీధికి గాడ్సే పేరు పెట్టడం గమనార్హం. కర్ణాటకలోని ఉడుపి జిల్లాలోని బోలా గ్రామంలో నాథూరామ్‌ గాడ్సే పేరుతో ఓ వీధి బోర్డు పెట్టారు. ఈ ఫొటోలు రెండ్రోజులపాటు విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇందుకు సంబంధించి అనుకూల, వ్యతిరేక పోస్టులు, కామెంట్లు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బోర్డును తొలగించినట్టు సమాచారం.

Also Read : కర్నాటకలో పెరుగుతున్న కేసులు..

First Published:  7 Jun 2022 1:23 PM IST
Next Story