క్యాన్సర్‌కి మందు వచ్చేసింది..
క్యాన్సర్.. ఈ పేరు వింటేనే ప్రతీ ఒక్కరు హడలిపోతుంటారు. ఒకసారి క్యాన్సర్ సోకితే దేహంలోని ఏ అవయవం అయినా నాశనం కావల్సిందే. క్యాన్సర్ చికిత్స కూడా అత్యంత ఖరీదైన వ్యవహారం. ఏ దశలో దీన్ని గుర్తించినా.. కొంత వరకు మాత్రమే దీన్ని నయం చేసే వీలుంటుంది. పూర్తిగా నయం అయినట్లు డాక్టర్లు చెబుతుంటారు. కానీ చాలా మందిలో ఏదో ఒక రోజు అది తిరగబెట్టడం ఖాయమే. అయితే తాజాగా న్యూయార్క్‌లోని స్లోవన్ కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్‌లో నిర్వహించిన […]
క్యాన్సర్.. ఈ పేరు వింటేనే ప్రతీ ఒక్కరు హడలిపోతుంటారు. ఒకసారి క్యాన్సర్ సోకితే దేహంలోని ఏ అవయవం అయినా నాశనం కావల్సిందే. క్యాన్సర్ చికిత్స కూడా అత్యంత ఖరీదైన వ్యవహారం. ఏ దశలో దీన్ని గుర్తించినా.. కొంత వరకు మాత్రమే దీన్ని నయం చేసే వీలుంటుంది. పూర్తిగా నయం అయినట్లు డాక్టర్లు చెబుతుంటారు. కానీ చాలా మందిలో ఏదో ఒక రోజు అది తిరగబెట్టడం ఖాయమే. అయితే తాజాగా న్యూయార్క్‌లోని స్లోవన్ కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్‌లో నిర్వహించిన ట్రయల్స్ ఫలితాలు క్యాన్సర్ రోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
రెక్టల్ క్యాన్సర్ (పురీషనాళానికి సంబంధించిన) వచ్చిన కొంత మంది రోగులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. 18 మంది రెక్టల్ క్యాన్సర్ రోగులకు ఆరు నెలల పాటు డోస్టార్‌లిమాబ్ అనే డ్రగ్‌ను అందించారు. ఆశ్చర్యకరంగా వారందరిలో క్యాన్సర్ ఆనవాళ్లు లేకుండా మటుమాయం అయ్యింది. 18 మంది రోగుల్లో కూడా క్యాన్సర్ కణజాలం అదృశ్యమైనట్లు పరిశోధకులు తెలిపారు.
డోస్టార్‌లిమాబ్ డ్రగ్‌లో లాబొరేటరీలో ఉత్పత్తి చేసిన మాలిక్యూల్స్ ఉంటాయి. అవి మనిషి శరీరంలో యాంటీ బాడీస్‌కు సబ్‌స్టిట్యూట్‌లాగా పనిచేస్తాయి. 18 మంది పేషెంట్లకు ఈ డ్రగ్ ఇచ్చిన తర్వాత వచ్చిన ఫలితాల్లో క్యాన్సర్ ట్యూమర్ పూర్తిగా మాయం అయిపోయింది. పేషెంట్లందరికీ ఫిజికల్ ఎగ్జామినేషన్‌తో పాటు ఎండోస్కోపీ, టోమోగ్రఫీ, పీఈటీ స్కాన్స్, ఎంఆర్ఐ స్కాన్స్ అన్నీ తీసి చూసినా క్యాన్సర్ జాడ కనిపించలేదు.
ఈ ట్రయల్స్‌లో పాల్గొన్న క్యాన్సర్ రోగులందరూ చికిత్సలో భాగంగా కీమోథెరపీ, రేడియేషన్, సర్జరీలు కూడా చేసుకొని శారీరిక బాధలు అనుభవించారు. ఈ ట్రీట్మెంట్ల కారణంగా వారికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చాయి. అలాంటి వారిలో డోస్టార్‌లిమాబ్ డ్రగ్ విజయవంతంగా క్యాన్సర్‌ను పారదోలగలిగింది. వారికి తర్వాత చికిత్సలు చేయాల్సిన అవసరం కూడా ఏర్పడలేదని వైద్యులు చెప్తున్నారు.
చరిత్రలో తొలిసారి ఒక డ్రగ్ క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయగలిగిందని స్లోవన్ కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్ డాక్టర్ లూయిస్ ఏ. దియాజ్ తెలిపారు. ఈ పరిశోధన మెడికల్ ప్రపంచంలో ప్రకంపనలు పుట్టిస్తోందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ అలన్ పి. వీనోక్ వెల్లడించారు. ప్రతీ రోగిలో పూర్తిగా క్యాన్సర్ నయం అవడం అనేది ఇప్పటి వరకు ఎవరూ వినలేదని ఆయన చెప్పారు. ప్రపంచంలో ఇదే తొలిసారని ఆయన స్పష్టం చేశారు. ట్రయల్స్‌లో కొంత మంది రోగులకు కాంప్లికేషన్స్ వచ్చాయి. కానీ అవేమంత బాధించేవి కావని ఆయన అన్నారు.
ట్రయల్స్ ముగిసిన తర్వాత ఆ పేషెంట్లలో క్యాన్సర్ నయమయ్యిందని చెప్పగానే కన్నీళ్లు పెట్టుకున్నట్లు ఈ పరిశోదనలో పాలుపంచుకున్న ఆంకాలజిస్ట్ డాక్టర్ ఆండ్రియా సిరెక్ తెలిపారు. ఈ ట్రయల్స్‌లో ప్రతీ రోగి మూడు వారాలకు ఒక డోస్టార్‌లిమాబ్ చొప్పున ఆరు నెలలు వాడినట్లు చెప్పారు. ప్రస్తుతం క్యాన్సర్‌పై పరిశోధనలు చేస్తున్న అనేక మంది శాస్త్రవేత్తలు ఈ ట్రయల్స్ ఫలితాలను విశ్లేషించే పనిలో పడ్డారు.