రేప్ బాధితురాలి వివరాలు వెల్లడించిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌పై కేసు
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఆమ్నీషియా పబ్ రేప్ కేసులో మైనర్ బాధితురాలి వివరాలను బహిర్గతపరచడంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదు అయ్యింది. మీడియా మీట్ పెట్టి బాధితురాలి ఫొటోలు, వీడియోలు రిలీజ్ చేశారు. అంతే కాకుండా నేరస్థుల వివరాలను కూడా ప్రకటించారు. అందులో కొంత మంది మైనర్లు ఉన్నారు. ఈ ఫొటోలు, వీడియోలు అవసరం అయితే డీజీపీ మహేందర్‌రెడ్డికి కూడా పంపుతానంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై అబిడ్స్ పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ 228ఏ కింద కేసు నమోదు […]
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఆమ్నీషియా పబ్ రేప్ కేసులో మైనర్ బాధితురాలి వివరాలను బహిర్గతపరచడంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదు అయ్యింది. మీడియా మీట్ పెట్టి బాధితురాలి ఫొటోలు, వీడియోలు రిలీజ్ చేశారు. అంతే కాకుండా నేరస్థుల వివరాలను కూడా ప్రకటించారు. అందులో కొంత మంది మైనర్లు ఉన్నారు. ఈ ఫొటోలు, వీడియోలు అవసరం అయితే డీజీపీ మహేందర్‌రెడ్డికి కూడా పంపుతానంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై అబిడ్స్ పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ 228ఏ కింద కేసు నమోదు చేశారు.
ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను వైరల్ చేసిన సుభాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పాత బస్తీకి చెందిన సుభాన్ తన యూట్యూబ్ ఛానల్‌లో వీడియోలు పెట్టి పలు సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ చేశాడు. మరోవైపు ఈ వీడియోలు రఘునందన్ రావు, సుభాన్‌కు ఎలా చేరాయనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎమ్మెల్యే కొడుకే వీడియోలు తీసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
కాగా, తనపై పెట్టిన కేసు విషయంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రంగా స్పందించారు. తాను మీడియాకు విడుదల చేయక ముందే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయన్నారు. పలు టీవీ ఛానల్స్ సీసీ టీవీ ఫుటేజీని కూడా ప్రసారం చేశాయన్నారు. తాను ఎక్కడా బాధితురాలి ముఖం కనపడేలా చూపెట్టలేదని, ఆమె పేరు కూడా చెప్పలేదని రఘునందర్ కవర్ చేసుకున్నారు. ఈ కేసును మా బీజేపీ లీగల్ సెల్ చూసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రఘునందర్ రావు విషయంలో మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. బాధితురాలు, నిందితుల వివరాలను రఘునందన్ రావు ఎలా బయటపెడతాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఒక లాయర్‌గా నిందితుల వివరాలు తెలిస్తే బయటపెట్టుకోవచ్చు.. కానీ బాధితురాలి ఫొటోలు, వీడియోలు విడుదల చేయడం నేరమే అని పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య అన్నారు. ఆయన ఒక లాయర్ అయి ఉండి.. ఈ విషయాలన్నీ తెలిసి కావాలనే బయటపెట్టనట్లు అనిపిస్తోందని ఆమె అన్నారు.
ALSO READ: శ్రీవాణి ట్రస్ట్ పై అసత్య ప్రచారం.. కేసుల నమోదుకు టీటీడీ నిర్ణయం..