సల్మాన్ ఖాన్ ను చంపేందుకు 4లక్షలతో రైఫిల్ కొన్న గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను హత్య చేసేందుకు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ 4 లక్షల రూపాయలతో విదేశాల నుండి స్ప్రింగ్ రైఫిల్ ను తెప్పించారని ఇండియా టుడేలో వచ్చిన ఓ కథనం తెలిపింది. పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా దారుణ హత్య తర్వాత సల్మాన్ ఖాన్ ను కూడా హత్య చేస్తామని లారెన్స్ బిష్ణోయ్ పేరుతో బెధిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ప్రముఖ క్రిమినల్ లారెన్స్ బిష్ణోయ్ గతంలో కూడా సల్మాన్ ఖాన్‌ను […]
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను హత్య చేసేందుకు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ 4 లక్షల రూపాయలతో విదేశాల నుండి స్ప్రింగ్ రైఫిల్ ను తెప్పించారని ఇండియా టుడేలో వచ్చిన ఓ కథనం తెలిపింది.
పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా దారుణ హత్య తర్వాత సల్మాన్ ఖాన్ ను కూడా హత్య చేస్తామని లారెన్స్ బిష్ణోయ్ పేరుతో బెధిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ప్రముఖ క్రిమినల్ లారెన్స్ బిష్ణోయ్ గతంలో కూడా సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని బెదిరించాడు.
బిష్ణోయ్ కమ్యూనిటీ దేవుడిగా భావించే కృష్ణజింక ను సల్మాన్ ఖాన్ చంపడం వల్ల అతన్ని చంపాలని లారెన్స్ బిష్ణోయ్ ప్లాన్ చేశాడు. 2011 లో ‘రెడీ’ మూవీ షూటింగ్ సమయంలో సెట్స్‌లో అతన్ని చంపాలని ప్లాన్ చేసాడు, కానీ ఆ ప్లాన్ విఫలమైంది.
ఆ తర్వాత ముంబయిలో సల్మాన్ నివాసం ఉండే గెలాక్సీ అపార్ట్ మెంట్ వద్ద కొన్నేళ్ల కిందట తన అనుచరుడితో రెక్కీ చేయించాడు. సల్మాన్ ఖాన్ ను గురితప్పకుండా కాల్చి చంపేందుకు ఫిన్ లాండ్ తయారీ అస్సాల్ట్ రైఫిల్ ను కూడా విదేశాల నుంచి తెప్పించాడు. ఈ అధునాతన తుపాకీ ఖరీదు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుందట. అయితే, లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడ్ని, ఇతర ముఠా సభ్యుల్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ ప్లాన్ విఫలమైంది. ఆ తర్వాత ఇతర కేసుల్లో లారెన్స్ బిష్ణోయ్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేయగా, ప్రస్తుతం అతడు ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నాడు.
సిద్దూ మూస్ వాలా హత్య పై జైలులోనే లారెన్స్ బిష్ణోయ్ ని పోలీసులు విచారిస్తున్నారు. ఈ సందర్భంగా బిష్ణోయ్ సల్మాన్ ఖాన్ ను చంపేందుకు త్శాము వేసిన ప్రణాళికను వివరించినట్టు సమాచారం.