పాస్‌వర్డ్‌లతో ఇక అవసరం లేదు.. వాటి స్థానంలో కొత్త టెక్నాలజీ
ఫోన్ ఆన్ చేయడం మొదలు పెడితే.. ఈ-మెయిల్, పేమెంట్ యాప్స్, సోషల్ మీడియా.. ఇలా ఏ అకౌంట్‌కు అయినా పాస్‌వర్డ్ తప్పనిసరి. ప్రతీ ఒక్కదానికి ఒక్కోరకమైన పాస్‌వర్డ్ పెట్టి గుర్తు పెట్టుకోవడం కష్టమే. అన్నింటికీ ఒకే పాస్‌వర్డ్ పెడదామన్నా.. కొన్నింటికి కీవర్డ్స్ కారణంగా అనుమతి ఉండదు. దీంతో చాలా మంది తమ పాస్‌వర్డ్‌లు మొబైల్, ల్యాప్‌టాప్స్‌లో విడిగా దాచి పెట్టడమో లేదా గూగుల్‌లో ‘రిమెంబర్ పాస్‌వర్డ్’లో పెట్టేసి వదిలేయడమో చేస్తుంటారు. కానీ ఏ రోజైనా మన మొబైల్ […]
ఫోన్ ఆన్ చేయడం మొదలు పెడితే.. ఈ-మెయిల్, పేమెంట్ యాప్స్, సోషల్ మీడియా.. ఇలా ఏ అకౌంట్‌కు అయినా పాస్‌వర్డ్ తప్పనిసరి. ప్రతీ ఒక్కదానికి ఒక్కోరకమైన పాస్‌వర్డ్ పెట్టి గుర్తు పెట్టుకోవడం కష్టమే. అన్నింటికీ ఒకే పాస్‌వర్డ్ పెడదామన్నా.. కొన్నింటికి కీవర్డ్స్ కారణంగా అనుమతి ఉండదు. దీంతో చాలా మంది తమ పాస్‌వర్డ్‌లు మొబైల్, ల్యాప్‌టాప్స్‌లో విడిగా దాచి పెట్టడమో లేదా గూగుల్‌లో ‘రిమెంబర్ పాస్‌వర్డ్’లో పెట్టేసి వదిలేయడమో చేస్తుంటారు. కానీ ఏ రోజైనా మన మొబైల్ లేదా ల్యాప్‌టాప్ కనుక హ్యాకర్ల చేతికి చిక్కితే మన పని అయిపోయినట్లే. వాళ్లకు పాస్‌వర్డ్‌లు కూడా మనం సులభంగా అందించినట్లే. కాబట్టి పాస్‌వర్డ్‌కు మించిన ప్రొటెక్షన్ ఏదైనా ఉండాలని గత కొన్నేళ్లుగా ఆపిల్ కంపెనీ సహా గూగుల్, మైక్రోసాఫ్ట్ పరిశోధనలు చేస్తున్నాయి.
ఈ క్రమంలో ఆపిల్ సంస్థ ఒక అడుగు ముందుకు వేసింది. మాక్ ఓఎస్ వెంచ్యూరా (macOS Ventura) లో పాస్‌వర్డ్‌తో అవసరం లేని టెక్నాలజీని తీసుకొని వచ్చింది. కొత్త మాక్ ఓఎస్ వెంచ్యూరాలో పాస్ వర్డ్‌ల బదులు “పాస్ కీ” లు వాడే అవకాశం ఉన్నది. ఫిడో అలయన్స్‌తో కలిసి ఆపిల్ సంస్థ ఈ టెక్నాలజీని అభివృద్ది చేసింది. పాస్‌వర్డ్ లేని ప్రపంచానికి ఇది మొదటి అడుగు అని చెప్పుకొచ్చింది.
పాస్ కీలను ఆపిల్ నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీగా అభివర్ణించింది. ఇవి ఉపయోగించడానికి చాలా సులభంగా ఉండటంతో పాటు ఎక్కువ సెక్యూరిని అందించేలా డిజైన్ చేశారు. ఈ డిజిటల్ కీ మనం ఉపయోగించే డివైజ్‌లలో ముందుగానే ఇన్‌స్టాల్ చేసి ఉంచుతారు. కానీ వీటి వివరాలు ఏ వెబ్ సర్వర్‌లో కూడా నిక్షిప్తం చేసి ఉండవు. దీంతో హ్యాకర్లు కూడా దీన్ని క్రాక్ చేయడం కష్టం. అంతే కాకుండా పాస్ కీలను యూజర్ షేర్ చేయడానికి కూడా వీలుండదు. పాస్ కీలు మనం ఏదైనా డివైజ్‌లోకి టచ్ ఐడీ లేదా ఫేస్ ఐడీ ద్వారా ఈజీగా సైన్ ఇన్ అవడానికి ఉపయోగపడతాయి.
ఐక్లౌడ్ కీ చైన్ ద్వారా ఈ పాస్‌కీలు మనం ఉపయోగించే అన్ని ఆపిల్ ప్రొడక్ట్స్‌కు సింక్ అవుతాయి. దీంతో మాక్, ఐఫోన్, ఐపాడ్, ఆపిల్ టీవీ వంటి వాటిలో ఈజీగా లాగిన్ అవ్వొచ్చు. అంతే కాకుండా ఇవి ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడి ఉండటంతో మరింత భద్రంగా తయారవుతాయి. మనం ఆపిల్ ఐఫోన్‌లో ఈ కీ ఇన్‌స్టాల్ చేసుకుంటే.. ఇక దాని నుంచే ఏ డివైజ్, ఈ-మెయిల్, సోషల్ మీడియా అకౌంట్‌లో అయినా లాగిన్ అవ్వొచ్చు. నాన్-ఆపిల్ డివైజ్‌లలోకి కూడా మన ఆపిల్ డివైజ్ ఉపయోగించి లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతానికి కేవలం ఆపిల్ మాత్రమే ఈ టెక్నాలజీని వాడటానికి రెడీగా ఉన్నది. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో వెంచ్యూరా విడుదల కానున్నది. దాంట్లో ఈ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ కూడా మరో ఏడాది లోపే ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొని వచ్చే అవకాశం ఉన్నట్లు టెక్నాలజీ వర్గాలు చెప్తున్నాయి.