Telugu Global

చిరు అభిమాన బలమూ తాకట్టుకేనా?

హఠాత్తుగా జనసేన తాను యాక్టివ్ అయ్యానన్న భావన కలిగించేందుకు కొద్దిరోజులుగా ప్రయత్నిస్తోంది. పవన్ కల్యాణ్ కూడా ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుని మీడియాలో నలుగుతున్నారు. పొత్తులపైనే పవన్ ప్రధానంగా మాట్లాడుతున్నారు. ఈసారి టీడీపీ తగ్గాలి అని పవన్ డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ తగ్గి తీరుతుందన్నది పవన్ నమ్మకం. వచ్చే ఎన్నికల్లో పొత్తు కుదరకపోతే పవన్‌ కల్యాణ్‌కు పోయేది ఏమీ లేదు. టీడీపీ ఈసారి ఓడితే ఇక చంద్రబాబు నాయకత్వం నిలవడం కష్టం. సీఎంగా జగన్‌ తప్ప ఎవరైనా […]

చిరు అభిమాన బలమూ తాకట్టుకేనా?
X
హఠాత్తుగా జనసేన తాను యాక్టివ్ అయ్యానన్న భావన కలిగించేందుకు కొద్దిరోజులుగా ప్రయత్నిస్తోంది. పవన్ కల్యాణ్ కూడా ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుని మీడియాలో నలుగుతున్నారు. పొత్తులపైనే పవన్ ప్రధానంగా మాట్లాడుతున్నారు. ఈసారి టీడీపీ తగ్గాలి అని పవన్ డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ తగ్గి తీరుతుందన్నది పవన్ నమ్మకం. వచ్చే ఎన్నికల్లో పొత్తు కుదరకపోతే పవన్‌ కల్యాణ్‌కు పోయేది ఏమీ లేదు. టీడీపీ ఈసారి ఓడితే ఇక చంద్రబాబు నాయకత్వం నిలవడం కష్టం. సీఎంగా జగన్‌ తప్ప ఎవరైనా పర్వాలేదు అన్నట్టుగా టీడీపీకి వైసీపీ ప్రభుత్వం నుంచి సవాళ్లు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు ఈసారి తాను చెప్పినట్టు తగ్గుతారని.. భారీగా సీట్లు డిమాండ్ చేయాలని పవన్ కల్యాణ్ ఆలోచన చేస్తున్నారు.
సీట్ల రూపంలోనైనా, మరో రూపంలోనైనా ఈసారి టీడీపీని వీలైనంత పిండాలన్నట్టుగా పవన్ తీరు ఉంది.
అదే సమయంలో తనకు బలం చాలా ఉందని చూపేందుకు పవన్ కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ చిరంజీవి అభిమానులను కలుపుకుపోయేందుకు పెద్దగా ఆయన ప్రయత్నించలేదు. రాజకీయం ఎవరిదారి వారిదే అని గతంలో పవన్ మాట్లాడారు కూడా. ఇప్పుడు మాత్రం అన్ని జిల్లాల్లోని చిరంజీవి అభిమానులతో జనసేన పెద్దలు సమావేశం అవుతున్నారు. జనసేనకు మద్దతు ఇవ్వని వారు అసలు మెగా ఫ్యాన్సే కాదని రెండురోజుల క్రితం నాగబాబు బ్లాక్‌మెయిల్ తరహాలో మాట్లాడారు. ఆదివారం నాదెండ్ల మనోహర్‌ చిరంజీవి అభిమానులతో సమావేశం నిర్వహించి… జనసేన తరపున రాజకీయ పక్రియలో పాల్గొనాలని వారిని కోరారు.
ఈ ప్రయత్నాలన్నీ ఎందుకంటే.. తన బలం, తన అన్న అభిమానుల బలం, సామాజిక వర్గ బలం ఇవన్నీ చూపించి చంద్రబాబును వీలైనంత పిండడం కోసమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈఎత్తులను గమనించే కాబోలు టీడీపీ కూడా ప్రస్తుతానికి గట్టిగా మాట్లాడుతోంది. మొన్నటి ఎన్నికల్లో జనసేనకు డిపాజిట్లు వచ్చింది 16 చోట్ల మాత్రమేనన్న అంశాన్ని తెరపైకి తెస్తోంది. జనసేన కలిస్తే నాలుగు సీట్లు పెరుగుతాయి.. ఒకవేళ కలకపోయినా 120 కొట్టేస్తామని టీడీపీ నేతలు పైకి మాట్లాడుతున్నారు. కానీ చంద్రబాబుకు అసలు విషయం తెలుసు. ఓ 50 సీట్లు పొత్తుల్లో పోయినా… అన్ని పార్టీలను కలుపుకుని వెళ్తేనే జగన్‌ ధాటిని ఎదుర్కొగలను అన్న విషయం ఆయనకు తెలుసు. పవన్‌ కల్యాణ్ కాస్త ఎక్కువ డిమాండ్ చేయాలని ప్రయత్నించినా.. ఆఖరిలో ఏ విధంగా పవన్‌ను దారికి తెచ్చుకుని.. పొత్తు పొడిపించాలో చంద్రబాబుకు గతంలో ఉన్న అనుభవం పనికొస్తుంది.
First Published:  5 Jun 2022 12:59 PM IST
Next Story