మా పెళ్లికి.. రండి.. రారండి.. పెళ్లి పిలుపుల్లో బిజీగా నయన్..!
సౌత్ టాప్ హీరోయిన్, తమిళ డైరెక్టర్ విగ్నేష్ శివన్ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల కిందట వీరికి నిశ్చితార్థం కూడా జరిగింది. దీంతో అతి త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కుతారని వార్తలు వచ్చాయి. పెళ్లి తిరుమలలో చేసుకునేందుకు నయనతార ఆసక్తి చూపినట్లు సమాచారం. అందుకోసం నయనతార, విగ్నేష్ శివన్ కొద్దిరోజుల కిందట తిరుమలకు వచ్చారు. అక్కడ కొన్ని కల్యాణ మండపాలను పరిశీలించారు. రెండు దఫాలుగా వీరు తిరుమలలోని పలు ప్రాంతాల్లో పరిశీలన […]
సౌత్ టాప్ హీరోయిన్, తమిళ డైరెక్టర్ విగ్నేష్ శివన్ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల కిందట వీరికి నిశ్చితార్థం కూడా జరిగింది. దీంతో అతి త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కుతారని వార్తలు వచ్చాయి.
పెళ్లి తిరుమలలో చేసుకునేందుకు నయనతార ఆసక్తి చూపినట్లు సమాచారం. అందుకోసం నయనతార, విగ్నేష్ శివన్ కొద్దిరోజుల కిందట తిరుమలకు వచ్చారు. అక్కడ కొన్ని కల్యాణ మండపాలను పరిశీలించారు.
రెండు దఫాలుగా వీరు తిరుమలలోని పలు ప్రాంతాల్లో పరిశీలన జరిపారు. అయితే నయనతార వివాహానికి భారీ సంఖ్యలో అతిథులు తరలివచ్చే అవకాశం ఉండడంతో, అంతమంది అయితే తిరుమలలో ఇబ్బంది అవుతుందని టీటీడీ అన్నట్లు తెలుస్తోంది.దీంతో నయన్, విగ్నేష్ తమ వివాహ వేదికను మార్చినట్లు సమాచారం. జూన్ 9వ తేదీన మహాబలిపురంలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.
పెళ్లికి పెద్దగా సమయం కూడా లేకపోవడంతో నయన్, విగ్నేష్ తమ సన్నిహితులు, బంధువులకు వివాహ ఆహ్వాన పత్రికలను అందిస్తున్నారు. శనివారం రాత్రి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన తనయుడు ఉదయనిధిని నయన్, విగ్నేష్ కలిశారు. తమ వివాహానికి హాజరు కావాలని ఆహ్వానించారు.
నయనతార వివాహానికి బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ నుంచి పెద్ద సంఖ్యలో స్టార్ హీరోలు, ప్రముఖ నటులు, సినీ ఇండస్ట్రీకి సంబంధించి పలు విభాగాలకు చెందిన వారు హాజరు కానున్నారు. జూన్ 8వ తేదీ రాత్రి మహాబలిపురంలో వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.