Telugu Global
NEWS

వైసీపీ వర్సెస్ బీజేపీ.. ఈ బంధంపై జూలై-4న క్లారిటీ..

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో తటస్థ వైఖరిని కొనసాగిస్తోంది వైసీపీ. ఎప్పుడూ సూటిగా విమర్శించలేదు, అలాగని కేంద్రం విధానాలను పొగడనూ లేదు. అదే సమయంలో బీజేపీ కూడా ఏపీ ప్రభుత్వంపై ఎప్పుడూ నిందలు వేయలేదు. రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం కేంద్ర నిధులతో పథకాలు అమలు చేస్తున్నారని, కనీసం మోదీ ఫొటో కూడా వేయడంలేదని, ఏపీలో హిందువులకు అన్యాయం జరుగుతోందంటూ.. విమర్శలు చేస్తుంటారు. ఈ దశలో వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ అధినాయకత్వం వైఖరి ఏంటి..? జగన్ పాలనపై […]

వైసీపీ వర్సెస్ బీజేపీ.. ఈ బంధంపై జూలై-4న క్లారిటీ..
X

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో తటస్థ వైఖరిని కొనసాగిస్తోంది వైసీపీ. ఎప్పుడూ సూటిగా విమర్శించలేదు, అలాగని కేంద్రం విధానాలను పొగడనూ లేదు. అదే సమయంలో బీజేపీ కూడా ఏపీ ప్రభుత్వంపై ఎప్పుడూ నిందలు వేయలేదు. రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం కేంద్ర నిధులతో పథకాలు అమలు చేస్తున్నారని, కనీసం మోదీ ఫొటో కూడా వేయడంలేదని, ఏపీలో హిందువులకు అన్యాయం జరుగుతోందంటూ.. విమర్శలు చేస్తుంటారు. ఈ దశలో వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ అధినాయకత్వం వైఖరి ఏంటి..? జగన్ పాలనపై మోదీ రియాక్షన్ ఏంటి..? మోదీ మెచ్చుకోకపోయినా పర్లేదు, విమర్శలు కూడా చేయలేదంటే అది కచ్చితంగా విశేషమే. ఆ విశేషం ఏంటో జూలై 4న తేలిపోయే అవకాశముంది.

తెలంగాణలో రాజకీయ పర్యటన కాకపోయినా, అధికారిక కార్యక్రమానికి వచ్చినా.. పనిగట్టుకుని కేసీఆర్ కుటుంబ పాలనను విమర్శించి వెళ్తారు ప్రధాని నరేంద్రమోదీ. ఇప్పుడాయన ఏపీకి వస్తున్నారు. జూలై 4న భీమవరం వస్తున్నారు. ఏపీలో కూడా స్థానిక ప్రభుత్వాన్ని మోదీ విమర్శిస్తారా. కనీసం జగన్ పాలనపై స్పందిస్తారా..? ఒకవేళ విమర్శిస్తే అది ఏ స్థాయిలో ఉంటుంది. తెలంగాణలో కేసీఆర్ పాలనపై ధ్వజమెత్తినట్టు, ఏపీలో వైసీపీ పాలనపై విరుచుకుపడతారా..? లేక ప్రియమైన శత్రువుగా భావించి సైలెంట్ గా వెళ్లిపోతారా..? వేచి చూడాలి.

బీజేపీ, వైసీపీ రెండూ మిత్రపక్షాలు కాదు. అలాగని.. పొరుగు రాష్ట్రంలో లాగా.. మరీ అంత శత్రుత్వం లేదు. ఏపీలో అధికారంలోకి వస్తామనే ఆశ కేంద్ర నాయకత్వంలో కూడా లేదు. అందుకే ఇక్కడ రాజకీయాలను వారు లైట్ తీసుకున్నారు. ఎప్పుడో కాని ఓసారి అలా చుట్టపు చూపుగా వస్తారు. అదే తెలంగాణకు అయితే మాత్రం పదే పదే క్యూ కడుతుంటారు, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించి వెళ్తుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు, ఏపీలో కూడా ఎన్నికలకు ఇంకా రెండేళ్లే సమయం ఉంది. స్నేహం అయినా, శతృత్వం అయినా.. ఇప్పుడే ఓ క్లారిటీకీ వస్తే మంచిది. మరి ఏపీ పర్యటనలో మోదీ ఆ దిశగా ఏవైనా సంకేతాలిస్తారా.. రాష్ట్ర రాజకీయాలపై, బీజేపీ పొత్తులపై క్లారిటీ ఇస్తారా.. అనేది వేచి చూడాలి.

First Published:  4 Jun 2022 3:04 AM IST
Next Story