Telugu Global
NEWS

బాబూ.. దమ్ముంటే అక్కడ పోటీ చేయండి..

ఇటీవల నిర్వహించిన మహానాడుపై టీడీపీ శ్రేణులు తెగ ప్రచారం చేసుకుంటున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా తమకు బలం పెరిగిందని వచ్చే ఎన్నికల్లో తమదే విజయం అన్నట్టుగా ఆ పార్టీ నేతలు, ఓ వర్గం మీడియా తెగ ప్రచారం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా వైసీపీ మహిళా నేత, సంస్కృత, తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి టీడీపీకి ఓ సవాలు విసిరారు. ‘తెలుగుదేశం పార్టీ బలపడిపోయిందని తెగ ఊదరగొడుతున్నారు కదా.. మరి మీకు ధైర్యం ఉంటే త్వరలో […]

ycp-leader-nandamuri-lakshmiparvati-challenge-to-tdp-chief-chandrababu
X

ఇటీవల నిర్వహించిన మహానాడుపై టీడీపీ శ్రేణులు తెగ ప్రచారం చేసుకుంటున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా తమకు బలం పెరిగిందని వచ్చే ఎన్నికల్లో తమదే విజయం అన్నట్టుగా ఆ పార్టీ నేతలు, ఓ వర్గం మీడియా తెగ ప్రచారం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా వైసీపీ మహిళా నేత, సంస్కృత, తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి టీడీపీకి ఓ సవాలు విసిరారు.

‘తెలుగుదేశం పార్టీ బలపడిపోయిందని తెగ ఊదరగొడుతున్నారు కదా.. మరి మీకు ధైర్యం ఉంటే త్వరలో జరగబోయే ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీచేసి మీ సత్తా ఏమిటో తెలుసుకోండి. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ ధైర్యం ఉందా?’ అంటూ ఆమె సవాలు విసిరారు.అంతేకాక తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.

టీడీపీలో మహిళలకు ఏ మాత్రం గౌరవం లేదని పేర్కొన్నారు. నారా లోకేశ్ పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టాక.. ఆ పార్టీ మరింత పతనం అయ్యిందని వాపోయారు. కాగా అక్కడ తాము పోటీచేయడం లేదని ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఎవరైనా ఎమ్మెల్యే లేదా ఎంపీ చనిపోతే.. వారి కుటుంబసభ్యులకే అక్కడ టికెట్ దక్కితే తాము పోటీచేయబోమని .. ఇది తమ పార్టీ విధానమని చంద్రబాబు ప్రకటించారు.

కానీ విశ్లేషకుల వాదన మరోలా ఉంది. నిజానికి అక్కడ గెలవడం కాదు కదా.. గట్టి పోటీ ఇవ్వడం కూడా కష్టమేనని టీడీపీ అధినేతకు సమాచారం అందిందట. మరోవైపు ఆత్మకూరులో పోటీచేసేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చే.. బలమైన నేతలు కూడా ఆ పార్టీకి కనిపించడం లేదు.

ఇక చంద్రబాబు చేసేది లేక పోటీనుంచి విరమించుకున్నట్టు సమాచారం. దీంతో చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టేందుకు వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. దమ్ముంటే పోటీచేయాలని సవాళ్లు విసురుతున్నారు.కొంతకాలం క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి చెప్పుకోదగ్గ స్థానాలు రాలేదు. తెలుగుదేశం నేతలు మాత్రం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. గెలుపు తమదేనంటూ బీరాలు పలుకుతున్నారు. తాజాగా లక్ష్మీ పార్వతి విసిరిన సవాలుకు టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.

First Published:  4 Jun 2022 2:38 PM IST
Next Story