కథ చెప్పడానికి జర్మనీ వెళ్లాడు
ఉన్నట్టుండి సడెన్ గా జర్మనీ వెళ్లాడు దర్శకుడు త్రివిక్రమ్. ఆయనతో పాటు మ్యూజిక్ డైరక్టర్ తమన్, నిర్మాత నాగవంశీ కూడా జర్మనీకి వెళ్లారు. ఉన్నఫలంగా వీళ్లంతా జర్మనీ వెళ్లడానికి కారణం ఏంటంటే, మహేష్ అక్కడ ఉన్నాడు. అక్కడికి వెళ్లి మరీ ఫైనల్ నెరేషన్ ఇచ్చాడు త్రివిక్రమ్. అవును.. వినడానికి కాస్త విడ్డూరంగా అనిపించినప్పటికీ ఇదే నిజం. మహేష్ తో చేయాల్సిన సినిమాకు సంబంధించి జర్మనీ వెళ్లి మరీ నెరేషన్ ఇచ్చాడు త్రివిక్రమ్. మహేష్ ఇండియాకొచ్చిన తర్వాత కలిసి […]
ఉన్నట్టుండి సడెన్ గా జర్మనీ వెళ్లాడు దర్శకుడు త్రివిక్రమ్. ఆయనతో పాటు మ్యూజిక్ డైరక్టర్ తమన్, నిర్మాత నాగవంశీ కూడా జర్మనీకి వెళ్లారు. ఉన్నఫలంగా వీళ్లంతా జర్మనీ వెళ్లడానికి కారణం ఏంటంటే, మహేష్ అక్కడ ఉన్నాడు. అక్కడికి వెళ్లి మరీ ఫైనల్ నెరేషన్ ఇచ్చాడు త్రివిక్రమ్.
అవును.. వినడానికి కాస్త విడ్డూరంగా అనిపించినప్పటికీ ఇదే నిజం. మహేష్ తో చేయాల్సిన సినిమాకు సంబంధించి జర్మనీ వెళ్లి మరీ నెరేషన్ ఇచ్చాడు త్రివిక్రమ్. మహేష్ ఇండియాకొచ్చిన తర్వాత కలిసి మాట్లాడి, మార్పుచేర్పులు చేయడానికి టైమ్ పడుతుందని కాబట్టి, ముందే జర్మనీ వెళ్లి ఓకే చేయించుకుంటే బెటరని ఇలా చేశాడట.
ఇప్పటికే మహేష్ తో చేయాల్సిన సినిమా చాలా ఆలస్యమైంది. అప్పుడెప్పుడో వచ్చిన అల వైకుంఠపురములో తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టుకోలేదు త్రివిక్రమ్. మహేష్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. అందుకే, ఇలా స్టోరీ డిస్కషన్ కోసం జర్మనీ వెళ్లాడు. ఇంతకుముందు మహేష్ దుబాయ్ పర్యటనలో ఉంటే, అక్కడికి కూడా వెళ్లి కథా చర్చలు చేశాడు త్రివిక్రమ్.