Telugu Global
International

విమర్శలపై సిరాజ్ నారాజ్ హైదరాబాద్ పేసర్ ఫ్లావ్ షో

ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 15వ సీజన్ లీగ్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఓపెనింగ్ బౌలర్ మహ్మద్ సిరాజ్ స్ధాయికి తగ్గట్టుగా రాణించలేకపోడంతో. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెట్ విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా..సిరాజ్ ను ఆట తక్కువ…రేటు ఎక్కువ స్టార్ అంటూ ఆటపట్టించాడు. 7 కోట్ల రూపాయల. కాంట్రాక్టు సిరాజ్ కు అయాచితమేనని, సిరాజ్ లాంటి బౌలర్ ను తీసుకొని బెంగళూరు భారీమూల్యమే చెల్లించిందంటూ పలువురు విమర్శించడాన్ని సిరాజ్ తట్టుకోలేకపోతున్నాడు. ఒక్క సీజన్ వైఫల్యాన్ని చూపి తనను దండుగమారి […]

విమర్శలపై సిరాజ్ నారాజ్ హైదరాబాద్ పేసర్ ఫ్లావ్ షో
X

ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 15వ సీజన్ లీగ్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఓపెనింగ్ బౌలర్ మహ్మద్ సిరాజ్ స్ధాయికి తగ్గట్టుగా రాణించలేకపోడంతో.

విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెట్ విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా..సిరాజ్ ను ఆట తక్కువ…రేటు ఎక్కువ స్టార్ అంటూ ఆటపట్టించాడు. 7 కోట్ల రూపాయల.

కాంట్రాక్టు సిరాజ్ కు అయాచితమేనని, సిరాజ్ లాంటి బౌలర్ ను తీసుకొని బెంగళూరు భారీమూల్యమే చెల్లించిందంటూ పలువురు విమర్శించడాన్ని సిరాజ్ తట్టుకోలేకపోతున్నాడు.

ఒక్క సీజన్ వైఫల్యాన్ని చూపి తనను దండుగమారి అనడం సబబుగా లేదంటూ సిరాజ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

15 మ్యాచ్ లు…9 వికెట్లు!

ఐపీఎల్ 15వ సీజన్ లీగ్ 70 మ్యాచ్ ల సమరంలో మాజీ రన్నరప్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ టైటిల్ ఆశలతో బరిలో నిలిచింది. ఫాఫ్ డూప్లెసిస్, విరాట్ కొహ్లీ, హర్షల్ పటేల్, వనిందు హసరంగ మాక్స్ వెల్ లాంటి మేటి ఆటగాళ్ల తో పాటు

పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కు సైతం ఎనలేని ప్రాధాన్యమిచ్చింది.

ఒక్కమాటలో చెప్పాలంటే బెంగళూరు ఫ్రాంచైజీ తన ఆశలన్నీ మహ్మద్ సిరాజ్ పైనే పెట్టుకొంది.

2022 సీజన్ మెగా వేలానికి ముందే…తమ స్టార్ బౌలర్ హర్షల్ పటేల్ ను కాదని మహ్మద్ సిరాజ్ ను 7 కోట్ల రూపాయల ధరకు రిటెయిన్ చేసుకొంది. వేలం ద్వారా హర్షల్ పటేల్ ను 10 కోట్ల 75 లక్షల రూపాయల ధరకు సొంతం చేసుకొంది.

సిరాజ్ 15 మ్యాచ్ లు ఆడి భారీగా పరుగులు సమర్పించుకోడంతో పాటు తొమ్మిది వికెట్లు మాత్రమే పడగొట్టాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన క్వాలిఫైయర్ -2 కీలక పోరులో రెండు ఓవర్లలో 3 సిక్సర్లు బాదించుకొన్నాడు.

మొత్తం 15 మ్యాచ్ ల్లో 31 సిక్సర్లతో సహా 514 పరుగులకు 9 వికెట్లు మాత్రమే సిరాజ్ సాధించడంతో…విమర్శకులు తమ నోటికి పనిచెప్పారు. బెంగళూరును సిరాజ్ నిండాముంచాడంటూ మండిపడ్డారు.

10 లక్షల నుంచి 7కోట్లకు….

కీలకసమయాలలో జట్టుకు దన్నుగా ఉండాల్సిన సిరాజ్ దారుణంగా విఫలమయ్యాడంటూ దెప్పిపొడిచారు. వచ్చే సీజన్ లో సిరాజ్ ను వదిలించుకొంటే మంచిదని, సిరాజ్ కు 7 కోట్ల రూపాయల ధర చాల ఎక్కువంటూ ఆకాశ్ చోప్రా విశ్లేషించాడు.

సిరాజ్ ను వేలానికి ఉంచితే 7 కోట్ల రూపాయల ధర పలికే అవకాశమేలేదని చెప్పాడు. 2017 సీజన్లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన మహ్మద్ సిరాజ్ ..ప్రస్తుత 15వ సీజన్ వరకూ…65 మ్యాచ్ లు ఆడి 59 వికెట్లు పడగొట్టాడు.

2017 సీజన్లో 10 లక్షల రూపాయలుగా ఉన్న సిరాజ్ ధర..2018లో 2 కోట్ల 60 లక్షల రూపాయలకు పెరిగింది. 2022 సీజన్లో 7 కోట్ల రూపాయలకు పెరగడం విశేషం.

మరోవైపు..జోష్‌ హాజిల్‌వుడ్‌, హర్షల్‌ పటేల్‌ అద్భుత ప్రదర్శనతో జట్టుకు అండగా నిలిచారు. హర్షల్ పటేల్ 15 మ్యాచ్ ల్లో 19 వికెట్లు సాధించడం ద్వారా స్థాయికి, రేటుకి తగ్గట్టుగా రాణించగలిగాడు.

First Published:  4 Jun 2022 2:57 AM IST
Next Story