బీజేపీకి షాకిచ్చిన పవన్.. ఆత్మకూరు ఉప ఎన్నికకు జనసేన దూరం
ఆత్మకూరు ఉపఎన్నికల్లో టీడీపీ పోటీ చేయట్లేదని ఇదివరకే ప్రకటించారు చంద్రబాబు. బీజేపీ మాత్రం తాను పోటీలో ఉన్నానంటోంది. మిత్రపక్షం జనసేనను కలుపుకొని, వారితో చర్చించి, వారి మద్దతుతో అక్కడ అభ్యర్థిని నిలబెడతానంటోంది. దీనికోసం ఓ కమిటీని కూడా వేసింది. అయితే అభ్యర్థులు పోటీకి వెనకాడుతుండటంతో ఇంకా డైలమాలోనే ఉంది బీజేపీ. నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ కుమార్ పేరు వినిపించినా, ఆయనా వెనకడుగు వేస్తున్నట్టు సమాచారం. ఈ దశలో పవన్ కల్యాణ్ బీజేపీకి షాకిచ్చారు. ఆత్మకూరు […]
ఆత్మకూరు ఉపఎన్నికల్లో టీడీపీ పోటీ చేయట్లేదని ఇదివరకే ప్రకటించారు చంద్రబాబు. బీజేపీ మాత్రం తాను పోటీలో ఉన్నానంటోంది. మిత్రపక్షం జనసేనను కలుపుకొని, వారితో చర్చించి, వారి మద్దతుతో అక్కడ అభ్యర్థిని నిలబెడతానంటోంది. దీనికోసం ఓ కమిటీని కూడా వేసింది. అయితే అభ్యర్థులు పోటీకి వెనకాడుతుండటంతో ఇంకా డైలమాలోనే ఉంది బీజేపీ. నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ కుమార్ పేరు వినిపించినా, ఆయనా వెనకడుగు వేస్తున్నట్టు సమాచారం. ఈ దశలో పవన్ కల్యాణ్ బీజేపీకి షాకిచ్చారు. ఆత్మకూరు ఉప ఎన్నికలకు తాము దూరంగా ఉంటామని చెప్పారు.
మిత్రపక్షాలంటే రాజకీయ లక్ష్యం ఒకటే ఉండకపోయినా పర్లేదు, కానీ ఇరు పార్టీల రాజకీయ విధానాలు ఒకేరకంగా ఉండాలి. ఇటు బీజేపీ వారసత్వ రాజకీయాలకు మేం దూరం అంటోంది, అటు జనసేన.. దివంగత నేతల కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తే పోటీకి దూరం జరుగుతోంది. బద్వేలులో కూడా ఇలానే జరిగింది. బీజేపీ పోటీ చేసినా, జనసేన బహిరంగ మద్దతు ఇవ్వలేదు. జనసేన తరపున ఎవరూ ప్రచారానికి వెళ్లలేదు. దీంతో అసలు బీజేపీ అభ్యర్థి ఎవరనేది కూడా ఎవరూ పట్టించుకోలేదు. తిరుపతి ఉప ఎన్నికకంటే బద్వేలులో బీజేపీ ఘోర పరాభవం చవిచూసింది.
ఆత్మకూరులో కూడా అవమానమే..!
ఆత్మకూరులో కూడా బీజేపీకి అవమానమే జరిగేలా ఉంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ దూరంగా ఉంది. ఆత్మకూరులో మేకపాటి కుటుంబై ఉన్న సింపతీ వర్కవుట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక బీజేపీ పోటీ చేసినా ప్రచారానికి కనీసం మూడు వారాల టైమ్ కూడా లేదు. స్థానికేతరులను అభ్యర్థిగా ప్రకటించి సాహసం చేయాల్సిన సందర్భం. ఈ దశలో కాస్తో కూస్తో ఆత్మకూరులో స్థానిక సమస్యలపై ఇటీవల హడావిచి చేసిన జనసేన కూడా పోటీకి దూరం అంటే.. వార్ వన్ సైడేనని చెప్పాలి. పవవ్ ప్రకటనపై బీజేపీ ఇంకా రియాక్ట్ కాలేదు. ఎలాగైనా అక్కడ విక్రమ్ రెడ్డికి ప్రత్యర్థిని నిలబెట్టాలనే చూస్తోంది బీజేపీ.