హెచ్చించడం అంటే ఇరికించడమేనని పవన్ డౌట్
2019 ఎన్నికలకు ముందు వరకు బీజేపీ ఉత్తరాది పార్టీ, పాచిపోయిన లడ్డూలు ఇచ్చింది అంటూ విరుచుకుపడ్డ పవన్ కల్యాణ్.. ఎన్నికలు అయిపోగానే హఠాత్తుగా ఎర్ర తువ్వాలు కిందపడేసి కాషాయం కట్టేశారు. అలా చేయడానికి చాలా కారణాలున్నాయని చెబుతుంటారు. ఇప్పుడు అదే పవన్ కల్యాణ్ బీజేపీని వదిలించుకోవడం ఎలా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని కూటమి ఉమ్మడి సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటిస్తుందట కదా అన్న ప్రశ్నకు..” నేను గాల్లో మేడలు కట్టను. ఇదంతా ప్రచారం మాత్రమే.బీజేపీ అధ్యక్షుడు నడ్డా […]
2019 ఎన్నికలకు ముందు వరకు బీజేపీ ఉత్తరాది పార్టీ, పాచిపోయిన లడ్డూలు ఇచ్చింది అంటూ విరుచుకుపడ్డ పవన్ కల్యాణ్.. ఎన్నికలు అయిపోగానే హఠాత్తుగా ఎర్ర తువ్వాలు కిందపడేసి కాషాయం కట్టేశారు. అలా చేయడానికి చాలా కారణాలున్నాయని చెబుతుంటారు. ఇప్పుడు అదే పవన్ కల్యాణ్ బీజేపీని వదిలించుకోవడం ఎలా అన్నట్టుగా మాట్లాడుతున్నారు.
మిమ్మల్ని కూటమి ఉమ్మడి సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటిస్తుందట కదా అన్న ప్రశ్నకు..” నేను గాల్లో మేడలు కట్టను. ఇదంతా ప్రచారం మాత్రమే.బీజేపీ అధ్యక్షుడు నడ్డా నన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారనే విషయం నాకు తెలియదు. దీని గురించి నాతో మాట్లాడలేదు” అంటూ పవన్ సమాధానం ఇచ్చారు. రాజమహేంద్రవరం పర్యటనకు వస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను తాను కలిసే అవకాశేమేమీ లేదని కూడా పవన్ చెప్పారు.
నడ్డాను కలవబోను అని చెప్పడం, సీఎం అభ్యర్థి అనుకుని గాల్లో మేడలు కట్టబోను అని పవన్ చెప్పడం బట్టి.. సీఎం అభ్యర్థిగా ప్రకటించి బీజేపీ తనను బంధీగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తోందన్న భావనతో పవన్ ఉన్నట్టు అనిపిస్తోంది. గాల్లో మేడలు కట్టబోను అని చెప్పడం ద్వారా తాను సీఎం అభ్యర్థిగా సరిపోను అన్న స్పష్టతతో పవన్ ఉన్నారా అన్న భావన కలుగుతోంది.
పదేపదే పార్టీలను మారుస్తారన్న అపవాదు ఎదుర్కొంటున్న పవన్ కల్యాణ్.. బీజేపీని తనకు తానుగా ఈసారి వదిలేసేందుకు కాస్త సంశయిస్తున్నట్టుగా ఉంది. అదే సమయంలో సీఎం అభ్యర్థి అంటూ బీజేపీ వేస్తున్న గాలానికి తాను చిక్కకుండా ఉండేందుకు పవన్ జాగ్రత్తపడుతున్నారు. పవన్‌కు తాను ముఖ్యమంత్రి కావడమో, బీజేపీ అధికారంలోకి రావడమో కంటే.. జగన్‌మోహన్ రెడ్డిని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఆ ప్రయత్నంలో ఆయన తప్పనిసరిగా వచ్చే ఎన్నికల నాటికి బీజేపీతో తెగదెంపులు చేసుకుని అయినా సరే టీడీపీతో కలిసి వెళ్లే అవకాశం ఉంది. ఓట్లు చీలనివ్వను అన్న మాటకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నానని పవన్ మరోసారి చెప్పారు. వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు చీలకూడదు అంటే.. ఏ పార్టీ అయినా ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీతో జత కట్టాల్సి ఉంటుంది. పవన్ కల్యాణ్ కూడా ఆ దిశగానే పయణిస్తున్నారు.
ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజు తొలి నుంచి టీడీపీకి వ్యతిరేకంగా ఉంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే కాబోలు.. తనకు ఏపీ బీజేపీ నేతలతో సంబంధాలు లేవని, సోమువీర్రాజును కూడా తాను తొలిసారి 2014లోనే కలిశానని పవన్ వివరించారు. తన సంబంధాలన్నీ కేంద్ర బీజేపీ నేతలతోనే ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. సో.. తన గురించి ఏపీ బీజేపీ నేతలు చేసే వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న సంకేతాలు ఇచ్చేందుకే పవన్ ఈ వ్యాఖ్య చేసి ఉండొచ్చు. ఇక జాతీయ బీజేపీ నాయకులు ఎలాగో పదేపదే పవన్ గురించి మాట్లాడే అవకాశం ఉండదు. ఏదో అద్భుతం జరిగితే తప్ప.. 2024లో టీడీపీ పక్షాన పవన్ కల్యాణ్ సైన్యాధ్యక్షుడి పాత్ర పోషించడం దాదాపు ఖాయమే.