మంత్రులందరినీ రాజీనామా చేయమన్న ఒడిశా సీఎం
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కేబినెట్ లోని మంత్రులందరినీ రాజీనామా చేయాల్సిందిగా ఆయన ఆదేశించారు. త్వరలోనే వారంతా పదవులను త్యాగం చేయబోతున్నట్టు సమాచారం. ఒడిశా అసెంబ్లీ స్పీకర్ సూర్యనారాయణ పాత్రో కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే సీఎం నవీన్ పట్నాయక్ త్వరలో మంత్రి వర్గ పునర్వ్యవస్తీకరణ చేయబోతున్నట్టు సమాచారం. స్పీకర్ గా రాజీనామా చేసిన పాత్రోకు మంత్రి పదవి ఖాయమని సమాచారం. మంత్రులందరినీ ఒక్కసారిగా రాజీనామా చేయమని […]
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కేబినెట్ లోని మంత్రులందరినీ రాజీనామా చేయాల్సిందిగా ఆయన ఆదేశించారు. త్వరలోనే వారంతా పదవులను త్యాగం చేయబోతున్నట్టు సమాచారం. ఒడిశా అసెంబ్లీ స్పీకర్ సూర్యనారాయణ పాత్రో కూడా తన పదవికి రాజీనామా చేశారు.
ఇదిలా ఉంటే సీఎం నవీన్ పట్నాయక్ త్వరలో మంత్రి వర్గ పునర్వ్యవస్తీకరణ చేయబోతున్నట్టు సమాచారం. స్పీకర్ గా రాజీనామా చేసిన పాత్రోకు మంత్రి పదవి ఖాయమని సమాచారం.
మంత్రులందరినీ ఒక్కసారిగా రాజీనామా చేయమని ఆదేశించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
గతంలో ఏపీలోనూ సీఎం జగన్ మంత్రులతో రాజీనామా చేయించిన విషయం తెలిసిందే. అనంతరం అందులో కొందరికీ పదవులు దక్కగా.. చాలా మంది కొత్తవారికి కూడా అవకాశాలు దక్కాయి. అయితే ప్రస్తుతం ఒడిశా సీఎం కూడా అదే దారిలో పయనిస్తున్నట్టు కనిపిస్తోంది. ఆయన కొత్తవారికి అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకొని ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.
నవీన్ పట్నాయక్ కు దేశంలోనే అత్యంత నిజాయితీ పరుడైన ముఖ్యమంత్రిగా పేరుంది. ఇక ప్రజలు కూడా మూడు దఫాలుగా ఆయన పాలనను ఆదరిస్తున్నారు. తండ్రి బీజూ పట్నాయక్ నుంచి రాజకీయ వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న నవీన్ పట్నాయక్.. క్లీన్ సీఎంగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఎప్పుడూ వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నట్టు.. ప్రకటనలు చేసినట్టు కనిపించరు. తాజాగా మంత్రులందరినీ పక్కకు పెడుతున్నట్టు తీసుకున్న నిర్ణయం రాజకీయంగా చర్చనీయాంశం అయ్యింది.