Telugu Global
National

ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె పెళ్ళిని జరగనివ్వం – బీజేపీ హెచ్చరిక‌

తనను తానే వివాహం చేసుకుంటానని (సోలోగమీ) ప్రకటించి సంచలనం సృష్టించిన గుజరాత్ కు చెందిన క్షమా బిందు జూన్ 11న తన పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అయితే ఆ పెళ్ళిని అడ్డుకొని తీరుతామని బీజేపీ ప్రకటించింది. ‘సెల్ఫ్’ వివాహాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం వడోదరా మాజీ డిప్యూటీ మేయర్‌ సునీతా శుక్లా హెచ్చరికలు జారీ చేశారు. సోలోగామి అనేది హిందూ వివాహ ఆచారాలకు విరుద్ధమని, ఇతరులను ‘ప్రభావితం’ చేస్తుంద‌ని శుక్లా అన్నారు. ఇటువంటి వివాహాలు హిందూ జ‌నాభాను […]

ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె పెళ్ళిని జరగనివ్వం – బీజేపీ హెచ్చరిక‌
X

తనను తానే వివాహం చేసుకుంటానని (సోలోగమీ) ప్రకటించి సంచలనం సృష్టించిన గుజరాత్ కు చెందిన క్షమా బిందు జూన్ 11న తన పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అయితే ఆ పెళ్ళిని అడ్డుకొని తీరుతామని బీజేపీ ప్రకటించింది. ‘సెల్ఫ్’ వివాహాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం వడోదరా మాజీ డిప్యూటీ మేయర్‌ సునీతా శుక్లా హెచ్చరికలు జారీ చేశారు.

సోలోగామి అనేది హిందూ వివాహ ఆచారాలకు విరుద్ధమని, ఇతరులను ‘ప్రభావితం’ చేస్తుంద‌ని శుక్లా అన్నారు. ఇటువంటి వివాహాలు హిందూ జ‌నాభాను తగ్గిస్తాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

క్షమా బిందు నగరంలోని గోత్రి ప్రాంతంలోని ఒక ఆలయంలో తన పెళ్ళికి ప్రణాళిక చేసుకున్నారు. అయితే హిందూ గుడిలో పెళ్ళి జరిగనివ్వబోమని బీజేపీ నాయకురాలు సునీతా శుక్లా హెచ్చరించారు.

“ఆలయం మాకు పవిత్ర స్థలం. నగరంలోని ఏ ఆలయంలోనైనా సరే ఈ వివాహ వేడుకలు నిర్వహించేందుకు నేను ఆమెను అనుమతించను, ”అని శుక్లా అన్నారు.

స్వీయ వివాహం అనేది సాధారణమైన చర్య కాదు, అందుకే ఏ ఆలయంలోనైనా పూజలు చేయడాన్ని వ్యతిరేకించాలని నేను నిర్ణయించుకున్నాను, క్షమా తన ఇంట్లో లేదా మరేదైనా ప్రదేశంలో తన వివాహాన్ని నిర్వహించుకోవడానికి స్వేచ్ఛ ఉందని ఆమె తెలిపారు.

మరో వైపు క్షమా తన పెళ్ళిని సమర్ధించుకున్నారు. “నేను ఈ పెళ్లిని నా కోసమే ప్లాన్ చేసుకున్నాను, దాని చుట్టూ ఎలాంటి వివాదాలు అక్కర్లేదు,” అని ఆమె స్పష్టం చేశారు. బీజేపీ హెచ్చరికల నేపథ్యంలో తాను గుడిలోపల పెళ్ళి చేసుకోబోనని మరో వేదిక ఏర్పాటు చేసుకుంటానని ఆమె అన్నారు.

“నాపట్ల నాకున్న అపారమైన నిబద్ధత, స్వీయ-ప్రేమపై నాకున్న నమ్మకాన్నిగౌరవించటానికే తానీ పెళ్ళి చేసుకుంటున్నాను” అని క్షమా బిందు స్పష్టం చేశారు.

భారత దేశంలోనే మొదటి సారి జరగబోతున్న ఈ సోలోగమీని సాంప్రదాయ వాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా పలువురు యువత దీనిని ఆహ్వానిస్తున్నారు. మరి హిందూ సంస్థలు ఈ పెళ్ళిని జరగనిస్తాయా ? క్షమా బిందు తాను కోరుకుంటున్నట్టు తనను తాను పెళ్ళి చేసుకోగలదా ? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ఈ నెల 11వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.
.

First Published:  4 Jun 2022 3:08 AM IST
Next Story