Telugu Global
National

మైనారిటీలపై దాడి గురించి అమెరికా నివేదికపై భారత్ ఆగ్రహం

భారత్ లో మత మైనార్టీలపై దాడులు తీవ్రమయ్యాయన్న అమెరికా విదేశాంగశాఖ రిపోర్ట్ పై మనదేశం తీవ్రంగా స్పంధించింది. ఈ రిపోర్టు ఓటు బ్యాంకు రాజాకీయాలకు నిదర్శనమంటూ భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మండిపడ్డారు. 2021లో భారతదేశంలోని మైనారిటీ వర్గాలపై దాడులు ప్రతి రోజూ జరిగాయని, మైనార్టీలకు భారత్ లో భద్రత‌ కరువైందని యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ నివేదిక ఆరోపించింది. సంవత్సరం పొడవునా హత్యలు, దాడులు, బెదిరింపులతో సహా మతపరమైన మైనారిటీ […]

మైనారిటీలపై దాడి గురించి అమెరికా నివేదికపై భారత్ ఆగ్రహం
X

భారత్ లో మత మైనార్టీలపై దాడులు తీవ్రమయ్యాయన్న అమెరికా విదేశాంగశాఖ రిపోర్ట్ పై మనదేశం తీవ్రంగా స్పంధించింది. ఈ రిపోర్టు ఓటు బ్యాంకు రాజాకీయాలకు నిదర్శనమంటూ భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మండిపడ్డారు.

2021లో భారతదేశంలోని మైనారిటీ వర్గాలపై దాడులు ప్రతి రోజూ జరిగాయని, మైనార్టీలకు భారత్ లో భద్రత‌ కరువైందని యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ నివేదిక ఆరోపించింది.

సంవత్సరం పొడవునా హత్యలు, దాడులు, బెదిరింపులతో సహా మతపరమైన మైనారిటీ వర్గాలకు చెందిన సభ్యులపై దాడులు జరిగాయి. గోహత్య, గొడ్డు మాంసం వ్యాపారం ఆరోపణల ఆధారంగా హిందువులు కాని వారిపై ‘గో రక్షణ’ సంఘాల దాడుల సంఘటనలు జరిగాయి” అని అమెరికా నివేదిక పేర్కొంది.

అమెరికా నివేదికపై అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ, “అంతర్జాతీయ మత స్వేచ్ఛపై US స్టేట్ డిపార్ట్‌మెంట్ 2021 నివేదికలొ US సీనియర్ అధికారులవి అనాలోచిత వ్యాఖ్యలు. అంతర్జాతీయ సంబంధాలలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం దురదృష్టకరం.” అన్నారాయన‌

“ఇది పక్షపాత దృష్టితో అంచనా వేసిన నివేదిక ” అని బాగ్చి పేర్కొన్నారు.
భారతదేశం సహజంగా బహుళ‌త్వ సమాజం. మత స్వేచ్ఛకు, మానవ హక్కులకు అత్యంత విలువనిస్తుందని భాగ్చి వ్యాఖ్యానించారు.

“యుఎస్‌తో చర్చలలో, మేము అక్కడ జాతి విద్వేష‌పు దాడులు, ద్వేషపూరిత నేరాలు, తుపాకీ సంస్కృతితో సహా ఆందోళన కలిగించే అనేక అంశాలను క్రమం తప్పకుండా మేము లేవనెత్తుతున్నాం” అని బాగ్చీ చెప్పారు.

US విడుదల చేసిన మత స్వేచ్ఛ నివేదికను భారతదేశం గతంలోనే తిరస్కరించింది, రాజ్యాంగబద్ధంగా పౌరులకిచ్చిన‌ హక్కులపై ఒక విదేశీ ప్రభుత్వానికి మాట్లాడే హక్కు ఏమాత్రం లేదు అని భారత్ పేర్కొంది. మీడియాలో, సోషల్ మీడియాలో హిందువులపై, హిందూ మతంపై అవమానకరంగా వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులు హిందువేతరులను అరెస్టు చేశారని, అంతే తప్ప దాడులు ఎక్కడా జరగలేదని భారత్ తెలిపింది.

First Published:  4 Jun 2022 12:54 AM GMT
Next Story