Telugu Global
National

‘నా కారు 3, 4, 5 వ గేర్ లు అమ్మకానికి కలవు, బయ్యర్లు కావలెను’

మన దేశంలో అనేక నగరాలు ట్రాఫిక్ కష్టాలకు నెలవుగా మారాయి. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా ఉన్న భారతదేశపు ఐటీ హబ్ బెంగళూరు కూడా ట్రాఫిక్ కష్టాలకు ప్రసిద్ధి చెందింది. బెంగళూరువాసులు, ముఖ్యంగా రోజువారీ ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకుని అష్టకష్టాలు పడటం అక్కడ నిత్యకృత్యం. 2020లో డచ్ లొకేషన్ టెక్నాలజీ స్పెషలిస్ట్ అయిన టామ్‌టామ్ సంస్థ నిర్వహించిన అధ్యయనం ప్రకారం, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ‌ ట్రాఫిక్ రద్దీ బెంగళూరులో […]

bengaluru-man-shares-an-epic-post-on-traffic-jam-in-the-city
X

మన దేశంలో అనేక నగరాలు ట్రాఫిక్ కష్టాలకు నెలవుగా మారాయి. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా ఉన్న భారతదేశపు ఐటీ హబ్ బెంగళూరు కూడా ట్రాఫిక్ కష్టాలకు ప్రసిద్ధి చెందింది. బెంగళూరువాసులు, ముఖ్యంగా రోజువారీ ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకుని అష్టకష్టాలు పడటం అక్కడ నిత్యకృత్యం.

2020లో డచ్ లొకేషన్ టెక్నాలజీ స్పెషలిస్ట్ అయిన టామ్‌టామ్ సంస్థ నిర్వహించిన అధ్యయనం ప్రకారం, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ‌ ట్రాఫిక్ రద్దీ బెంగళూరులో ఉంది. ఆ సంస్థ అధ్యయనం ప్రకారం, బెంగుళూరు వాసులు తమ ప్రయాణం కోసం సంవత్సరంలో 10 రోజుల మూడు గంటలు అదనంగా ఖర్చు చేస్తారు. నగరంలో రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాల వేగం 4-5 కిలో మీటర్లకు మించదు.

ఇప్పటి దాకా మీరు చదివింది సీరియస్ నిజం… ఇక ఆ కష్టాల్లోంచే కొంత మంది కామెడీ పుట్టిస్తుంటారు. కష్టాలు పడీ పడీ వాటికి పరిష్కారం దొరకక, నిస్సహాయ స్థితిలో ఆ కష్టాలపై జోకులు వేసుకొని సంత్రుప్తి పడుతుంటారు. అలా బెంగళూరు ట్రాఫిక్ కష్టాలపై ఓ వ్యక్తి చేసిన వ్యంగ్యపూరితమైన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బెంగుళూరుకు చెందిన ట్విట్టర్ వినియోగదారు శ్రీకాంత్ జోషి ఒక పోస్ట్ షేర్ చేశాడు., “బెంగళూరులోని నా స్నేహితుడు తన కారు 3, 4, 5 వ గేర్‌లను అమ్మాలని ప్లాన్ చేస్తున్నాడు. వాటిని ఇప్పటి వరకు ఒక్క సారి కూడా ఉపయోగించలేదు. షోరూం కండీషన్ లో ఉన్నాయి.” కొనేవాళ్ళెవరైనా ఉన్నారా ? అని ట్వీట్ చేశాడు.

గత నెల 25వ తేదీన చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అయ్యింది. ఒక్క బెంగళూరు వాసులే కాకుండా ఢిల్లీ, ముంబై తో సహా అనేక నగరాల నుండి నెటిజనులు స్పంధిస్తున్నారు. షేర్లు, కామెంట్లతో ట్రాఫిక్ కష్టాల పట్ల తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు.

First Published:  4 Jun 2022 11:11 AM IST
Next Story