ఆర్యసమాజ్ ఇచ్చే మ్యారేజ్ సర్టిఫికెట్ చెల్లదు – సుప్రీంకోర్టు కీలక తీర్పు..
పెళ్లి చేసుకోవడానికి పారిపోయే ప్రేమికులు మొదట వెళ్లాలనుకునే ప్లేస్ ఆర్యసమాజ్. ఆర్యసమాజ్ అందరికీ అందుబాటులో ఉండదు కానీ.. అందుబాటులో ఉన్నవారు మాత్రం కచ్చితంగా అక్కడికే వెళ్తారు. సామాన్యులయినా, సెలబ్రిటీలయినా పెద్దలతో ఇబ్బంది అనుకుంటే ముందుగా ఆర్యసమాజ్ ని ఆశ్రయించి మూడు ముళ్ల తంతు ముగిస్తారు. వారిచ్చే మ్యారేజ్ సర్టిఫికెట్ తో పోలీసుల రక్షణ కోరతారు. ఆర్యసమాజ్ ఇచ్చిన సర్టిఫికెట్ తో పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. పెద్దలకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తారే కానీ, పిల్లలకు పెళ్లైపోయినట్టు […]
పెళ్లి చేసుకోవడానికి పారిపోయే ప్రేమికులు మొదట వెళ్లాలనుకునే ప్లేస్ ఆర్యసమాజ్. ఆర్యసమాజ్ అందరికీ అందుబాటులో ఉండదు కానీ.. అందుబాటులో ఉన్నవారు మాత్రం కచ్చితంగా అక్కడికే వెళ్తారు. సామాన్యులయినా, సెలబ్రిటీలయినా పెద్దలతో ఇబ్బంది అనుకుంటే ముందుగా ఆర్యసమాజ్ ని ఆశ్రయించి మూడు ముళ్ల తంతు ముగిస్తారు. వారిచ్చే మ్యారేజ్ సర్టిఫికెట్ తో పోలీసుల రక్షణ కోరతారు. ఆర్యసమాజ్ ఇచ్చిన సర్టిఫికెట్ తో పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. పెద్దలకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తారే కానీ, పిల్లలకు పెళ్లైపోయినట్టు ధృవీకరిస్తారు. కానీ ఇకపై ఇలాంటివి చెల్లవు. ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నాం, ఇదిగో సర్టిఫికెట్ అంటూ పోలీస్ స్టేషన్లను ఆశ్రయించే జంటలకు రక్షణ ఇవ్వడం కుదరదు. ఎందుకంటే ఆ సర్టిఫికెట్ చెల్లదంటూ తాజాగా సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చింది.
అసలు ఆర్యసమాజం అంటే ఏంటి..?
ఆర్య సమాజ్ అంటే ఇప్పటి తరం ప్రేమ పెళ్లిళ్లకు కేరాఫ్ అడ్రస్ అని చెబుతుంది కానీ.. అసలు ఆర్య సమాజ్ స్థాపించిన ఉద్దేశం వేరు. 1875 ఏప్రిల్-10న బొంబాయిలో స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని మొట్టమొదటి సారిగా స్థాపించారు. ఆ తర్వాత వివిధ పట్టణాల్లో ఆర్య సమాజం బ్రాంచ్ లు ఏర్పాటయ్యాయి. హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి, వేదాల గురించి ప్రచారం చేయడానికి, వేదాధ్యయనానికి అవకాశం కల్పించే ఉద్దేశంతో ఆర్య సమాజాన్ని స్థాపించారు. కానీ కాలక్రమంలో ఆ కార్యక్రమాలన్నీ తగ్గిపోయాయి.
మీ పనేంటి..? మీరు చేస్తున్నదేంటి..?
ఇటీవల ప్రేమ వివాహాల సందర్భంలో ప్రముఖంగా ఆర్య సమాజ్ పేరు తెరపైకి వచ్చేది. కోర్టు కేసుల వరకు ఈ వ్యవహారాలు వెళ్లేవి. ప్రేమజంట అనే అనుమానం ఉన్నా కూడా ఆర్య సమాజ్ లో అడ్డంకులేవీ లేకుండా పెళ్లి చేస్తారు కాబట్టి చాలామంది అక్కడికే వెళ్తుంటారు. ఈ క్రమంలో ప్రేమ జంటలు, వారి పెద్దల మధ్య తగాదాలు తీర్చడం పోలీసులు, కోర్టులకు తలకు మించిన భారంగా మారుతోంది. దీంతో ఆర్య సమాజ్ వివాహాలపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారించిన కోర్టు.. ఆర్య సమాజ్ ఇచ్చే మ్యారేజి సర్టిఫికెట్ చెల్లదని తీర్పు చెప్పింది. ఆర్య సమాజం పనేంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి అని సూటిగా ప్రశ్నించింది. కేవలం ప్రేమ పెళ్లిళ్ల కోసమే ఆర్య సమాజం ఉన్నట్టుగా తప్పుడు ప్రచారం జరుగుతోందని వ్యాఖ్యానించింది.