Telugu Global
National

ప్రియాంకా గాంధీకి కూడా కరోనా పాజిటీవ్

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కరోనా పాజిటీవ్ అని తేలిన మర్నాడే ఆమె కూతురు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీకి కూడా కరోనా పాజిటీవ్ అని తేలింది. ఆమె కూడా ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ఆమె గత వారంలో కాంగ్రెస్ నాయకులతో వరుస సమావేశాలకు హాజరయ్యారు. పార్టీ ఉదయపూర్ చింతన్ శిబిరం తర్వాత జరుగుతున్న‌ ఉత్తర ప్రదేశ్ చింతన్ శిబిరంలో భాగంగా లక్నోలో ఉన్నారు. అయితే తల్లికి కరోనా పాజిటీవ్ అని తెలియగానే […]

ప్రియాంకా గాంధీకి కూడా కరోనా పాజిటీవ్
X

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కరోనా పాజిటీవ్ అని తేలిన మర్నాడే ఆమె కూతురు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీకి కూడా కరోనా పాజిటీవ్ అని తేలింది. ఆమె కూడా ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ఆమె గత వారంలో కాంగ్రెస్ నాయకులతో వరుస సమావేశాలకు హాజరయ్యారు. పార్టీ ఉదయపూర్ చింతన్ శిబిరం తర్వాత జరుగుతున్న‌ ఉత్తర ప్రదేశ్ చింతన్ శిబిరంలో భాగంగా లక్నోలో ఉన్నారు. అయితే తల్లికి కరోనా పాజిటీవ్ అని తెలియగానే ఆమె వెంటనే ఢిల్లీ వెళ్ళిపోయారు. అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకు కూడా కరోనా పాజిటీవ్ లక్షణాలు ఉన్నట్టు తేలింది.

“పరీక్షల్లో నాకు తేలికపాటి లక్షణాలతో COVID19 అని తేలింది. అన్ని ప్రోటోకాల్‌లను అనుసరించి, నేను ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నాను. ఈ మధ్య‌ నాతో కలిసిన వారిని అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను” అని ప్రియాంక ట్వీట్ చేసింది.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కెసి వేణుగోపాల్‌కు కూడా కోవిడ్ -19 పాజిటివ్ అని తేలింది.
కాంగ్రెస్ చింతన్ శిబిరం తర్వాత సోనియా, ప్రియాంకలకు కరోనా పాజిటీవ్ రావడంతో వారితో కలిసిన కొంత మంది కాంగ్రెస్ నాయకులు కూడా సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్ళారు.

First Published:  3 Jun 2022 7:05 AM IST
Next Story