Telugu Global
NEWS

సస్పెండ్ చేస్తే సరిపోదు, కారణం చెప్పాల్సిందే – కొత్తపల్లి కామెడీ

“టీడీపీలో నేనేం తప్పు చేశానని నన్ను దూరం పెట్టారు. పార్టీ లేదు బొక్కాలేదు అన్న అచ్చెన్నపై చర్యలెందుకు తీసుకోలేద”ని సూటిగా ప్రశ్నించారు దివ్యవాణి. అక్కడ ఆమె ఆవేదన కరెక్టే. కానీ ఇక్కడ వైసీపీనుంచి సస్పెండ్ అయిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా అదే లాజిక్ తీస్తున్నారు. “పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజుని ఎందుకు భరిస్తున్నారు. నేనేం తప్పు చేశానని నన్ను సస్పెండ్ చేశారం”టూ ప్రశ్నిస్తున్నారు. తన సస్పెన్షన్ కి సరైన కారణం […]

కొత్తపల్లి సుబ్బారాయుడు
X

టీడీపీలో నేనేం తప్పు చేశానని నన్ను దూరం పెట్టారు. పార్టీ లేదు బొక్కాలేదు అన్న అచ్చెన్నపై చర్యలెందుకు తీసుకోలేద”ని సూటిగా ప్రశ్నించారు దివ్యవాణి. అక్కడ ఆమె ఆవేదన కరెక్టే. కానీ ఇక్కడ వైసీపీనుంచి సస్పెండ్ అయిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా అదే లాజిక్ తీస్తున్నారు. “పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజుని ఎందుకు భరిస్తున్నారు. నేనేం తప్పు చేశానని నన్ను సస్పెండ్ చేశారం”టూ ప్రశ్నిస్తున్నారు. తన సస్పెన్షన్ కి సరైన కారణం చెప్పకపోతే న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు.

అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరిస్తూ జిల్లా కేంద్రంకోసం పోరాడారు. అధికార పార్టీ ఎమ్మెల్యేని నిందిస్తూ బహిరంగ వేదికపై చెప్పు తీసుకుని తనని తాను కొట్టుకున్నారు. పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా, ఆ నియోజకవర్గం నాదేనని స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇంత చేసినా ఇంకా అధిష్టానం చూస్తూ ఊరుకోవాలంటే కుదురుతుందా. అందుకే సస్పెన్షన్ వేటు వేసింది. అయితే ఈ కారణాలు కాదు, అసలు కారణం చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు కొత్తపల్లి. కారణం చెప్పకపోతే న్యాయపోరాటం చేస్తాననడమే ఇక్కడ పెద్ద ట్విస్ట్.

ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయంలో వైసీపీ వేచి చూసే ధోరణిలో ఉంది. పార్టీనుంచి సస్పెండ్ చేస్తే ఆయన స్వతంత్ర ఎంపీగా ఇంకా రెచ్చిపోయే అవకాశముంది. అందుకే పార్టీలో చీటీ చించేయకుండా.. ఎంపీగా అతనిపై అనర్హత వేటు వేయించాలని చూస్తోంది. కానీ బీజేపీ చల్లనిచూపుతో ఆ వేటు నుంచి తప్పించుకుంటున్నారు రఘురామకృష్ణంరాజు. ఇక్కడ కొత్తపల్లి విషయంలో అలాంటి మొహమాటాలకు తావులేదు. ఆయనకు పదవి లేదు. అందుకే వెంటనే సస్పెన్షన్ వేటు వేశారు. కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని వాపోతున్న కొత్తపల్లి.. పార్టీలోనే ఉండాలనుకునేవారయితే ఇంత రచ్చ చేసేవారు కాదు కదా అంటున్నారు స్థానిక వైసీపీ నేతలు. కేవలం గొడవ పెద్దది చేసేందుకే కొత్తపల్లి ఈ డ్రామాలాడుతున్నారంటూ మండిపడ్డారు. పార్టీయే కాదు పొమ్మంటే, ఇంకా న్యాయపోరాటం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. సింపతీ కోసమే ఆయన న్యాయపోరాటం అంటున్నారని మండిపడ్డారు స్థానిక వైసీపీ నేతలు.

First Published:  2 Jun 2022 9:37 PM GMT
Next Story