దివ్యవాణితో జర్నలిస్ట్ పేరు చెప్పించిన వైసీపీ సోషల్ మీడియా
టీడీపీకి రాజీనామా చేసిన సందర్భంగా దివ్యవాణి తన ప్రెస్‌మీట్‌లో ఒక జర్నలిస్టుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికార ప్రతినిధి పదవి అంటే కత్తిడాలు కూడా ఇవ్వాలా అంటూ ఒక జర్నలిస్ట్ ఇడియట్ తన గురించి మాట్లాడారంటూ.. ” థూ.. నీ బతుకు నీవు, నీ బతుకు చెడ, మనస్సాక్షి ఉన్నవాడివైతే ఉరేసుకుని చస్తావ్‌రా ఇడియట్.. నా ఆవేదన చెప్పుకుంటే కత్తిడాలు అని మాట్లాడుతావా?” అంటూ దివ్యవాణి విరుచుకుపడ్డారు. ప్రెస్‌మీట్‌లో సదరు జర్నలిస్ట్ పేరును ఆమె చెప్పలేదు. దాంతో వైసీపీ […]
టీడీపీకి రాజీనామా చేసిన సందర్భంగా దివ్యవాణి తన ప్రెస్‌మీట్‌లో ఒక జర్నలిస్టుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికార ప్రతినిధి పదవి అంటే కత్తిడాలు కూడా ఇవ్వాలా అంటూ ఒక జర్నలిస్ట్ ఇడియట్ తన గురించి మాట్లాడారంటూ.. ” థూ.. నీ బతుకు నీవు, నీ బతుకు చెడ, మనస్సాక్షి ఉన్నవాడివైతే ఉరేసుకుని చస్తావ్‌రా ఇడియట్.. నా ఆవేదన చెప్పుకుంటే కత్తిడాలు అని మాట్లాడుతావా?” అంటూ దివ్యవాణి విరుచుకుపడ్డారు. ప్రెస్‌మీట్‌లో సదరు జర్నలిస్ట్ పేరును ఆమె చెప్పలేదు.
దాంతో వైసీపీ నెటిజన్లు.. దివ్యవాణి మాటలను చంద్రబాబుకు, కొందరు జర్నలిస్ట్‌లకు ఆపాదిస్తూ ఫోటోలను జత చేసి.. ఆమె తిట్టింది వీరినే అంటూ ప్రచారం చేశారు. మరికొందరు వైసీపీ నెటిజన్లు.. దివ్యవాణి ఇడియట్, థూ నీ బతుకు అంటూ తిట్టింది చంద్రబాబునే అంటూ పోస్టులు పెట్టారు. దాంతో రాత్రికి దివ్యవాణి ఒక వీడియోను విడుదల చేశారు. తాను చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు.
తాను వ్యాఖ్యలు చేసింది జర్నలిస్ట్ సాయి గురించి అని వివరణ ఇచ్చారు. అతడే తనను ఉద్దేశించి అధికార ప్రతినిధి పదవి అంటే ఏమనుకుంటున్నారు.. కత్తి డాలు ఉంటుందని అనుకున్నారా అంటూ మాట్లాడారని ఆమె విమర్శించారు. జర్నలిస్ట్ సాయికి ఇప్పుడు కూడా చెబుతున్నానని.. బతకడం చేతగాకపోతే అడుక్కుని బతికితే శభాష్ సాయి అంటారే గానీ విషయం తెలియకుండా ఇష్టానుసారం మాట్లాడడం మంచిది కాదని సలహా ఇచ్చారు.
వైసీపీ సోదరులకూ తాను ప్రేమతో చెబుతున్నానని.. చంద్రబాబు మీద ఇప్పటికీ గౌరవం ఉందని.. తాను జర్నలిస్ట్ సాయి గురించి ఇడియట్ అంటే దాన్ని చంద్రబాబును అన్నట్టు, ఇతరులను అన్నట్టు ప్రచారం చేయడం సరికాదని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా మంచి రాజకీయాలు చేయాలని కోరారు. తన వ్యాఖ్యలను కట్ చేసి చెడుగా ప్రచారం చేయడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ఎదుటివారి వ్యక్తిత్వాలను నాశనం చేసేలా ప్రచారం చేయవద్దని కోరారు.