Telugu Global
NEWS

ఆర్‌.కృష్ణయ్యపై రవీంద్రారెడ్డి ఫిర్యాదు, కేసు నమోదు

వైసీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్‌. కృష్ణయ్యపై కేసు నమోదు అయింది. రవీంద్రారెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్ రాయదుర్గం పీఎస్‌లో ఈ కేసు నమోదైంది. ఆర్‌ .కృష్ణయ్య తన ఇంటి మీదకు రౌడీలను, గూండాలను పంపి బెదిరిస్తున్నారంటూ రవీంద్రారెడ్డి చెబుతున్నారు. ఆధారాలను కోర్టుకు సమర్పించడంతో కేసు నమోదుకు కోర్టు ఆదేశించింది. దాంతో ఆర్‌.కృష్ణయ్య అతడి అనుచరులపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. ఆర్‌.కృష్ణయ్యకు తనకు 20ఏళ్లుగా […]

ఆర్‌.కృష్ణయ్యపై రవీంద్రారెడ్డి ఫిర్యాదు, కేసు నమోదు
X

వైసీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్‌. కృష్ణయ్యపై కేసు నమోదు అయింది. రవీంద్రారెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్ రాయదుర్గం పీఎస్‌లో ఈ కేసు నమోదైంది. ఆర్‌ .కృష్ణయ్య తన ఇంటి మీదకు రౌడీలను, గూండాలను పంపి బెదిరిస్తున్నారంటూ రవీంద్రారెడ్డి చెబుతున్నారు.

ఆధారాలను కోర్టుకు సమర్పించడంతో కేసు నమోదుకు కోర్టు ఆదేశించింది. దాంతో ఆర్‌.కృష్ణయ్య అతడి అనుచరులపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. ఆర్‌.కృష్ణయ్యకు తనకు 20ఏళ్లుగా స్నేహం ఉందని.. అయినప్పటికీ ఇటీవల తన భూమిని కబ్జా చేసేందుకు ఆర్‌ కృష్ణయ్య ప్రయత్నించారని రవీంద్రారెడ్డి చెబుతున్నారు.

తానేమీ అప్పు లేకపోయినా డబ్బులు ఇవ్వాలంటూ మనుషులను పంపిస్తున్నారని.. డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించారన్నారు. తనకు నయూం గ్యాంగ్‌తో సంబంధాలున్నాయని, ఒకప్పుడు ఆ గ్యాంగ్‌ను తానే నడిపేవాడినని.. తనకు ఎదురు ఉండదని, తనకు సమాంతర ప్రభుత్వం నడిపేంత శక్తి ఉందని ఆర్‌ కృష్ణయ్య బెదిరించాడని బాధితుడు చెబుతున్నారు. బీసీ నేత ముసుగులో ఆర్‌. కృష్ణయ్య చేసేవన్నీ తప్పుడు పనులేనని.. ఇలాంటి వ్యక్తికి రాజ్యసభ సీటు ఎలా ఇస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇతడి గురించి జగన్‌మోహన్ రెడ్డికి లేఖ రాస్తానన్నారు. ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డికి, వైవీ సుబ్బారెడ్డికి ఆర్‌. కృష్ణయ్య గురించి వివరించానని రవీంద్రారెడ్డి చెబుతున్నారు.

రవీంద్రారెడ్డి అమెరికాకు వెళ్లిన సమయంలో అతడి భూమినికబ్జా చేసేందుకు ఆర్‌. కృష్ణయ్య ప్రయత్నించినట్టు చెబుతున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఆర్‌ కృష్ణయ్యపై 447, 427, 506,384 రెడ్‌ విత్ 34 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

ALSO READ: బండి సంజయ్ కి షాకిచ్చిన ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భగవత్

First Published:  3 Jun 2022 5:52 AM GMT
Next Story