Telugu Global
NEWS

సినిమా టిక్క‌ట్లపై కమీషన్ వసూలు చేయనున్న ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కట్లపై కమిషన్ వసూలు చేయనుంది. సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇకపై ప్రతి టికెట్‌పైనా 2 శాతం కమీషన్ వసూలు చేయాలని నిర్ణయించింది. ఏపీ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా సినిమా టికెట్లను ప్రభుత్వం ఆన్‌లైన్‌లో విక్రయించనుంది. ఇక నుంచి రాష్ట్రంలో ఎక్కడ‌ సినిమా చూడాలన్నా ఈ పోర్టల్ ద్వారానే టికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రైవేటు యాప్‌ల ద్వారా టికెట్లు కొనుగోలు చేసినా […]

ap-govt-fix-commission-on-movie-tickets
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కట్లపై కమిషన్ వసూలు చేయనుంది. సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇకపై ప్రతి టికెట్‌పైనా 2 శాతం కమీషన్ వసూలు చేయాలని నిర్ణయించింది.

ఏపీ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా సినిమా టికెట్లను ప్రభుత్వం ఆన్‌లైన్‌లో విక్రయించనుంది. ఇక నుంచి రాష్ట్రంలో ఎక్కడ‌ సినిమా చూడాలన్నా ఈ పోర్టల్ ద్వారానే టికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రైవేటు యాప్‌ల ద్వారా టికెట్లు కొనుగోలు చేసినా ప్రభుత్వానికి రెండుశాతం కమీషన్ చెల్లించాల్సిందే.

కాగా, సినిమా టికెట్ల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వమే ఆన్‌లైన్ ద్వారా టికెట్లు విక్రయించాలన్న ప్రతిపాదన ఇటీవల వివాదాస్పదమైన‌ సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది.

సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు కోర్టు అనుమతినిచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్‌, టెలివిజన్‌, థియేటర్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSFTVDC) ద్వారా ప్రభుత్వం ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా టికెట్‌పై రెండుశాతం కమీషన్ తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ALSO READ : విషయం అర్థమైంది.. టికెట్లపై అల్లు అరవింద్ కామెంట్స్‌

First Published:  2 Jun 2022 8:54 PM GMT
Next Story