విశాఖపట్నం: అచ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్‌లో గ్యాస్ లీక్, ఉద్యోగులకు తీవ్ర అస్వస్థత
విశాఖపట్నం అచ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్‌లో గ్యాస్ లీక్ అయిన ఘటనలో 30 మందికి పైగా ఉద్యోగులు ఆస్పత్రిపాలయ్యారు. పోరస్ లేబొరేటరీస్ లో అమ్మోనియా గ్యాస్ లీక్ అవడంతో పొరుగునే ఉన్న బ్రాండిక్స్ అపెరల్ ప్లాంట్‌లోని ఉద్యోగులు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఇందులో దాదాపు 200 పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. గ్యాస్ లీకవడంతో ఉద్యోగులు వాంతులు, తల తిరుగుడుతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పలువురు స్పృహతప్పి పడిపోయారు. ఇందులో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్టు తెలుస్తోంది. వీళ్ళందరినీ సమీపంలోని […]
విశాఖపట్నం అచ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్‌లో గ్యాస్ లీక్ అయిన ఘటనలో 30 మందికి పైగా ఉద్యోగులు ఆస్పత్రిపాలయ్యారు. పోరస్ లేబొరేటరీస్ లో అమ్మోనియా గ్యాస్ లీక్ అవడంతో పొరుగునే ఉన్న బ్రాండిక్స్ అపెరల్ ప్లాంట్‌లోని ఉద్యోగులు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఇందులో దాదాపు 200 పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.
గ్యాస్ లీకవడంతో ఉద్యోగులు వాంతులు, తల తిరుగుడుతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పలువురు స్పృహతప్పి పడిపోయారు. ఇందులో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్టు తెలుస్తోంది. వీళ్ళందరినీ సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు ఎస్పీ గౌతమి సాలి తెలిపారు.
కాగా ఈ గ్యాస్ లీకేజీ వ్యవహారంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఈ సంఘటనపై దర్యాప్తుకు సీఎం ఆదేశించారు. అధికారులను వివరణ కోరిన సీఎం బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. బాధితులను కలిసి భరోసా కల్పించాలని మంత్రి అమర్నాథ్‌కు ఆదేశించారు.
మరో వైపు గ్యాస్ లీకేజీ ఘట్నపై ప్రతిపక్ష తెలుగుదేశం తీవ్రంగా స్పంధించింది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి మచ్చుతునక అని ఆపార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. బాధితుల్లో గర్భిణులు కూడా ఉన్నారని తెలిసి చలించిపోయానన్నారు. ఎల్జీ పాలిమర్స్ నుంచి.. నేటి సీడ్స్ ప్రమాదం వరకు అన్నీ ప్రభుత్వ వైఫల్యాలేనని ఆరోపించారు. ప్రభుత్వం బాధితులకు మెరుగైన వైద్యం అందించి, అండగా నిలవాలని డిమాండ్ చేశారు.
.