Telugu Global
National

UP: ప్రభుత్వ ఆఫీస్ లో లాడెన్ ఫోటో – అత్యుత్తమ ఇంజనీర్ అంటూ వర్ణన

ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ లో ప్రభుత్వ ఆధీనంలో నడిచే విద్యుత్ పంపిణీ సంస్థకు చెందిన ప్రభుత్వ అధికారి తన కార్యాలయంలో అల్-ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ చిత్రాన్ని ఉంచినందుకు ఇబ్బందుల్లో పడ్డాడు. అధికారి ఒసామా బిన్ లాడెన్ చిత్రాన్ని ‘ప్రపంచపు అత్యుత్తమ జూనియర్ ఇంజనీర్’గా అభివర్ణించారు, ఆ తర్వాత అతన్ని సస్పెండ్ చేసి సీనియర్ అధికారులు విచారణ ప్రారంభించినట్లు మీడియా వార్తలు వచ్చాయి. గోడకు తగిలించి ఉన్న ఒసామా బిన్ లాడెన్ ఫోటో సోషల్ మీడియాలో హల్ […]

UP: ప్రభుత్వ ఆఫీస్ లో లాడెన్ ఫోటో – అత్యుత్తమ ఇంజనీర్ అంటూ వర్ణన
X

ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ లో ప్రభుత్వ ఆధీనంలో నడిచే విద్యుత్ పంపిణీ సంస్థకు చెందిన ప్రభుత్వ అధికారి తన కార్యాలయంలో అల్-ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ చిత్రాన్ని ఉంచినందుకు ఇబ్బందుల్లో పడ్డాడు. అధికారి ఒసామా బిన్ లాడెన్ చిత్రాన్ని ‘ప్రపంచపు అత్యుత్తమ జూనియర్ ఇంజనీర్’గా అభివర్ణించారు, ఆ తర్వాత అతన్ని సస్పెండ్ చేసి సీనియర్ అధికారులు విచారణ ప్రారంభించినట్లు మీడియా వార్తలు వచ్చాయి.

గోడకు తగిలించి ఉన్న ఒసామా బిన్ లాడెన్ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దక్షిణాంచల్ విద్యుత్ విత్రన్ నిగమ్ లిమిటెడ్ (DVVNL) సబ్ డివిజనల్ ఆఫీసర్ (SDO) రవీంద్ర ప్రకాష్ గౌతమ్ తన కార్యాలయంలో లాడెన్ చిత్రాన్ని ఉంచినట్లు అధికారులు తెలిపారు.

ఆ అధికారి చిత్రం క్రింద “గౌరవనీయమైన ఒసామా బిన్ లాడెన్, ప్రపంచంలోని అత్యుత్తమ జూనియర్ ఇంజనీర్” అని వ్రాసాడు.

కాగా లాడెన్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా సీనియర్ అధికారులకు విషయం తెలిసింది. SDO రవీంద్ర ప్రకాష్ గౌతమ్ ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. మరియు లాడెన్ చిత్రాన్ని కూడా కార్యాలయం నుండి తొలగించారు.

“ఈ ఘటనపై విచారణ అనంతరం డివివిఎన్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్, రవీంద్ర ప్రకాష్ గౌతమ్‌ను సస్పెండ్ చేశారు” అని ఫరూఖాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ సంజయ్ కుమార్ సింగ్ తెలిపారు.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా మాన్యువల్, 1956ను ఉల్లంఘించినందుకు SDO సస్పెండ్ చేయబడ్డారు. త్వరలో వివరణాత్మక విచారణ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి పంపబడుతుంది అని అధికారులు తెలిపారు.

First Published:  2 Jun 2022 9:59 AM IST
Next Story