Telugu Global
National

తెలంగాణ సహకరిస్తే మరో లక్ష కోట్లు దక్కేవి- అమిత్ షా

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందన్న టీఆర్ఎస్‌ విమర్శల్లో నిజం లేదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ఆవిర్బావ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన అమిత్ షా.. తెలంగాణకు తమ పార్టీ ఏనాడు వ్యతిరేకం కాదన్నారు. తెలంగాణ ఏర్పాటును బీజేపీ సమర్ధించిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీనే 2004 నుంచి 2014 వరకు తెలంగాణ డిమాండ్‌ను పట్టించుకోలేదన్నారు. చివరకు 2014 ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో రాష్ట్రాన్ని ప్రకటించిందన్నారు. […]

union-home-minister-amit-shah-participated-telangana-formationday-celebrations-at-telangana-bhavan-in-delhi
X

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందన్న టీఆర్ఎస్‌ విమర్శల్లో నిజం లేదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ఆవిర్బావ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన అమిత్ షా.. తెలంగాణకు తమ పార్టీ ఏనాడు వ్యతిరేకం కాదన్నారు. తెలంగాణ ఏర్పాటును బీజేపీ సమర్ధించిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీనే 2004 నుంచి 2014 వరకు తెలంగాణ డిమాండ్‌ను పట్టించుకోలేదన్నారు. చివరకు 2014 ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో రాష్ట్రాన్ని ప్రకటించిందన్నారు.

తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతూ భారతమాత నుదిటి బొట్టులా మెరిసిపోవాలన్నారు. తమకు ఏ రాష్ట్రంపైనా సవతి ప్రేమ లేదన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం మోడీ సర్కార్‌ 2.52 లక్షల కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించి ఉంటే మరో లక్ష కోట్లు రాష్ట్రానికి వచ్చేవన్నారు. తమ వద్ద నయాపైసాతో సహా లెక్కలున్నాయన్నారు. కేంద్రం ఇచ్చిన నిధుల లిస్ట్‌ను చదువుతూ వెళ్తే ఎన్నికలు వచ్చేస్తాయంటూ మాట్లాడారు.

ఆజాదీ కా అమృత్ మహాత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం సహకరించలేదని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు బాగుండాలనే తామూ కోరుకుంటున్నామన్నారు. రాష్ట్రాల అభివృద్ధే దేశ అభివృద్ధి అని నరేంద్రమోడీ నమ్ముతున్నారని అమిత్ షా వ్యాఖ్యానించారు.
ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ వచ్చినా గౌరవం ఇస్తామని అమిత్ షా చెప్పారు.

First Published:  2 Jun 2022 3:58 PM IST
Next Story