Telugu Global
NEWS

విశాఖలో భారీ శబ్ధంతో కుప్పకూలిన కొండ

విశాఖ జిల్లాలో ఒక కొండ కుప్పకూలింది. ఈ దృశ్యాలను చూసి స్థానికులు పరుగులు పెట్టారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో కొండ కుప్పకూలింది. కొంతకాలంగా ఈ కొండ వద్ద క్వారీయింగ్ జరుగుతోంది. చుట్టూ భారీగా తవ్వడంతో కొండ పట్టుకోల్పోయింది. కొండ శిఖరం నుంచి చెట్లు, రాళ్లు మొత్తం పెద్ద శబ్ధంతో కిందకు కూలిపోయాయి. కొండ ఈ తరహాలో కూలిపోవడానికి అక్రమ మైనింగే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ మైనింగ్‌ చాలాకాలం పాటు గతంలో కొనసాగింది. కొద్ది రోజుల క్రితమే […]

hill-collapsed-in-the-pendurthi-zone-of-visakhapatnam-district
X

విశాఖ జిల్లాలో ఒక కొండ కుప్పకూలింది. ఈ దృశ్యాలను చూసి స్థానికులు పరుగులు పెట్టారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో కొండ కుప్పకూలింది. కొంతకాలంగా ఈ కొండ వద్ద క్వారీయింగ్ జరుగుతోంది. చుట్టూ భారీగా తవ్వడంతో కొండ పట్టుకోల్పోయింది. కొండ శిఖరం నుంచి చెట్లు, రాళ్లు మొత్తం పెద్ద శబ్ధంతో కిందకు కూలిపోయాయి.

కొండ ఈ తరహాలో కూలిపోవడానికి అక్రమ మైనింగే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ మైనింగ్‌ చాలాకాలం పాటు గతంలో కొనసాగింది. కొద్ది రోజుల క్రితమే అక్కడ తవ్వకాలను నిలిపివేయించారు. తిరిగి క్వారీయింగ్ ఇటీవల మొదలైంది. అదే ఇప్పుడు కొండ కుప్పకూలడానికి కారణమైంది. కొండ కుప్పకూలడంపై పెందుర్తి తహసీల్దార్ స్పందించారు.

కొండ కుప్పకూలడానికి కారణాలు తెలుసుకుని ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామన్నారు. కొండ జారినప్పుడు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. కొండ కూలిన నేపథ్యంలో అటు వైపుప్రజల వెళ్లకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ALSO READ : బైరెడ్డికి షాకిచ్చిన వైసీపీ అధిష్టానం..

First Published:  2 Jun 2022 3:30 PM IST
Next Story