తెలంగాణలో సర్వేల కలకలం! ఆ ఎమ్మెల్యేల్లో టెన్షన్ !
తెలంగాణలో సర్వేల రాజకీయం నడుస్తోంది. టీఆర్‌ఎస్ తరపున ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ రంగంలోకి దిగిందో లేదో.. అప్పటి నుంచి ఏదో ఒక సర్వే పేరిట హల్‌చల్ నడుస్తోంది. తాజాగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ సర్వేలు అంటూ సోషల్ మీడియాలో కొన్ని పీడీఎఫ్ ఫార్మాట్ సర్వేలు సర్క్యులేట్ అవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 102 సీట్లు వస్తాయనేది ఇప్పుడు గులాబీ వాట్సాప్ గ్రూపుల్లో ఓ సర్వే రిపోర్టు హల్‌చల్ చేస్తోంది. నియోజకవర్గాల వారీగా పెట్టిన ఈ సర్వే […]
తెలంగాణలో సర్వేల రాజకీయం నడుస్తోంది. టీఆర్‌ఎస్ తరపున ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ రంగంలోకి దిగిందో లేదో.. అప్పటి నుంచి ఏదో ఒక సర్వే పేరిట హల్‌చల్ నడుస్తోంది. తాజాగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ సర్వేలు అంటూ సోషల్ మీడియాలో కొన్ని పీడీఎఫ్ ఫార్మాట్ సర్వేలు సర్క్యులేట్ అవుతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 102 సీట్లు వస్తాయనేది ఇప్పుడు గులాబీ వాట్సాప్ గ్రూపుల్లో ఓ సర్వే రిపోర్టు హల్‌చల్ చేస్తోంది. నియోజకవర్గాల వారీగా పెట్టిన ఈ సర్వే డిటైల్స్ 8 సిట్టింగ్ సీట్లు మాత్రం కోల్పోతుందనేది కొత్త మాట. స్టేషన్ ఘన్‌పూర్, ఇబ్రహీంపట్నం, పరిగి, మహబూబాబాద్, కల్వకుర్తి, నకిరేకల్ సిట్టింగ్ సీట్లలో ఓటమి తప్పదని సర్వే రిపోర్టులతో ఆ ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది.
కాంగ్రెస్ పేరిట షేర్ అవుతున్న సర్వేలో కొత్త కొత్త సంచలనాలే ఉన్నాయి. ఇప్పటికప్పుడు ఎన్నికలు వస్తే టీఆర్‌ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందనే ఆ సర్వేలో తేలినట్టు ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ఎస్ కు 72 నుంచి 75, కాంగ్రెస్ 22 నుంచి 24, బీజేపీకి 10 నుంచి 12 సీట్లు రావొచ్చనేది ఈ సర్వే మాట. దీని ప్రకారం టీఆర్‌ఎస్ భారీగానే సిట్టింగ్ సీట్లు కోల్పోయే అవకాశం ఉంది.
పార్టీల పేరే కాదు. ఎన్టీటీవీ, ఇండియా టుడే తెలంగాణలో లేటెస్ట్‌గా నిర్వహించిన సర్వేగా చెబుతున్న మరో రిపోర్టు కూడా వాట్సాప్ గ్రూపులో ఫార్వార్డ్ అవుతోంది. టీఆర్‌ఎస్‌కు మెజార్టీ వస్తుందని ఈ రిపోర్టులో ఉంది.
తెలంగాణ రాజకీయాల్లో సర్వే రిపోర్టులు కలకలం రేపుతున్నాయి. నిజాంగానే సర్వే చేశారా? లేక కేవలం వాట్సాప్ యూనివర్శిటీలో తిప్పుతున్నారా? పొలిటికల్‌గా మైండ్‌గేమ్ ఆడుతున్నారా? అనేది తేలడం లేదు. కానీ ఎన్నికల ముందు జరిగే హడావుడి మాత్రం తెలంగాణలో నడుస్తోంది.